ఆపిల్స్ లో చాల రకాలు ఉన్నాయి. సాధారణంగా ఎరుపు మరియు గ్రీన్‌ ఆపిల్స్ పుల్లని, తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. అయితే యాపిల్‌ తింటే ఆరోగ్యానికి మంచిదని అంతా చెబుతుంటారు. ఎర్రగా ఉండే యాపిల్‌ కన్నా గ్రీన్‌ యాపిల్‌ తినడం మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ యాపిల్ దీర్ఘ కాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. మ‌రి గ్రీన్ యాపిల్ తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


- గ్రీన్‌ యాపిల్స్‌లో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను పటిష్టంగా మారుస్తుంది. గ్రీన్‌ యాపిల్స్‌ను తరచూ తినడం వల్ల జీర్ణ సమస్యలనూ తగ్గించుకోవచ్చు.


- చర్మ క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు గ్రీన్‌ యాపిల్‌లో ఎక్కువగా ఉన్నాయి. మ‌రియు దీనిలో విటమిన్‌ సి ఫ్రీ రాడికల్స్‌ ద్వారా కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది.


- గ్రీన్ యాపిల్ రసం తీసుకుంటే ఆస్త్మాని నిరోధించవచ్చు. మధుమేహులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.


- బరువు తగ్గాలని అనుకొనే వారు.. ఆహారంలో తప్పనిసరిగా గ్రీన్ యాపిల్ ఉండేలా చూసుకోవాలి. ఇది రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక స్ట్రోక్స్ అవకాశాలు నివారించడం,గుండెకు సరైన రక్త ప్రవాహం నిర్వహణలో సహాయపడుతుంది.


- గ్రీన్ యాపిల్స్‌ను తరచూ తినేవారిలో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.


- గ్రీన్‌ యాపిల్‌లోని ఇనుము రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు పెంచడానికి తోడ్పడుతుంది. మ‌రియు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షించి, అది సక్రమంగా పనిచేసేలా సహకరిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: