సాధార‌ణంగా గోంగూర‌ను ఇష్ట‌ప‌డ‌నివారుండ‌రు. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో    ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలగి ఉంటూనే ఉంది. అయితే ఆకుకూరల్లో గోంగూరకు ఎంతో ప్రత్యేకత ఉంది. పుల్లపుల్లగా నోరూరించే గోంగూర రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోంగూరలో ఎ, బి1, బి9, సి విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, క్యాల్షియం, ఫోస్పర్స్‌, సోడియం, ఐరన్‌ ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్‌, కార్బొహైడ్రైట్స్‌ అధికంగా ఉండి, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.


గోంగూరలో యాంటీ యాక్సిడెంట్లు సమపాళ్లలో ఉన్నందు వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. గోంగూరలోని విటమిన్‌-ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. రేచీకటినీ తగ్గిస్తుంది. గోంగూరలోని కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు శరీర బరువును తగ్గిస్తాయి. గోంగూరని క్రమంగా వాడితే నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గిపోతాయి. గోంగూరలో ఉండే క్యాల్షియం ఎముకల సమస్యలకు మంచి ఫలితం ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒకరోజుకి కావాల్సిన విటమిన్‌-సి 53 శాతం లభిస్తుంది. అందువల్ల గోంగూర చర్మ సంబంధమైన సమస్యలకు మంచి పరిష్కారంగా చెప్పవచ్చు.  ప్రతిరాత్రీ నిద్రకు ముందు కప్పు గోంగూర రసం తాగితే మంచి నిద్రపడుతుందని చెబుతారు నిపుణులు. గోంగూర ఆకుల పేస్ట్‌ తలకు పట్టించి, ఉదయం స్నానం చేస్తే వెంట్రుకలు ఊడటం తగ్గి, బట్టతల రాకుండా కాపాడుతుంది.  దగ్గు, ఆయాసం తుమ్ము లతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా అంటే ఆహారంగానో లేక ఔషధం గానో తీసుకుంటే ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: