ఈ ప్రపంచంలో పకృతి కంటే అత్యుత్తమ వైద్యుడు ఎవరు లేరు.ఎందుకంటే సగటు మనిషి ఏమి తినాలి.ఎలా జీవించాలి,అనేది ప్రకృతి ఎప్పుడో తెలిపింది. అందుకోసం మనకు ఎన్నో సహజ సిద్దమైన ఆహారపదార్ధాలను అందించింది.వాటిలో శ్రేష్ఠమైన, ఆరోగ్యకరమైన ఆహారంలో ఆకుకూరలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.మానవ శరీరానికి కావల్సిన అనేక విటమిన్లు,ప్రోటీన్లు,ఖనిజ లవణాలు,పోషకాలు ఇలా ఎన్నో ఈ ఆకుకూరల్లో ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆకుకూరలు తినడానికి ఎంతో రుచికరంగా ఉండి త్వరగా అరుగుదలకి దోహద పడతాయి..



ఇక మన చుట్టూ అనేక రకాల ఆకుకూరలు ఉన్నప్పటికీ మనం కొన్నిటినే వాడుతున్నాం.వాటిలో గోంగూర,కరివేపాకు,చింత చిగురు,బచ్చలి,మెంతికూర, మునగాకు,క్యాబేజి, క్యాలీఫ్లవర్‌ ఆకులు,తోటకూర,ఉల్లికాడలు లాంటివి మాత్రమే మనం ఎక్కువగా తింటున్నాం.వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు.ఇక కొన్ని ఆకు కూరల వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.



తోటకూర,పాలకూరల్లో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది.గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఇది మనకెంతో ఉపయోగ పడతాయి.అంతేకాకుండా ఆరోగ్యకరమైన దంతాలకు,పటిష్టమైన ఎముకలకు,మీ శరీరంపై ఉన్న గాయాల నుంచి వెలువడే రక్తం గడ్డకట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా రక్తవృద్ధికి,రక్తానికి ఎర్రరంగు ఇచ్చేందుకు హిమో గ్లోబిన్‌ ఎంతో అవసరం.ఐరన్‌ లోపిస్తే పాండురోగం వస్తుంది.గోంగూర,ఎర్ర తోటకూర,బచ్చలి వంటి ఆకు కూరల్లో హిమోగ్లోబిన్‌ లభిస్తుంది.ఇక తరచూ మెంతికూర తినడం వలన దంతాలకు,ఎముకలకు కావాల్సిన పోషకాలు అందుతాయి.అంతేకాకుండా మధుమేహం, అధిక కొవ్వు తగ్గించేందుకు మెంతికూర ఎంతో ఉపయోగమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: