ప్రస్తుతం ఎటు చుసిన కూడా వర్షాలు.. బిజీ బిజీ పరుగుల ఈ కలికాలంలో ఒక్క క్షణం మనం ఆగితే ప్రపంఞ్చమ్ కూడా స్తంభిస్తుంది. ఇకపోతే చాలా మంది ఇంట్లో తిండి కంటే బయట ఫది ని ఎక్కువగా తీసుకుంటారు. దానికి కారణం టైం సరిపోక పోవడం.. ఈ వర్షాకాలంలో వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాంటి వారు బయట ఆహారాన్ని తీసుకోవడం కన్నా కొంచం పరిశుబ్రాంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మేలు అంటున్నారు నిపుణును. 


విషయానికొస్తే.. తొందరగా అరిగే  మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోండి. వండిన లేదా ఆవిరి కూరగాయలు అయిన బీరకాయ, గుమ్మడికాయ,
సలాడ్, పండ్లు, పెసర, కిచిడి, మొక్కజొన్న, శనగపిండి, వోట్మీల్‌తో తయారైన ఆహార పదార్థాలను తీసుకోవచ్చునట. వంటలకు తేలికగా ఉండే నెయ్యి, ఆలివ్ నూనె, మొక్కజొన్న నూనె, సం ఫ్లవర్  నూనెలను ఉపయోగించండి. హెవీ నూనెలైనా ఆవనూనె, వెన్న, వేరుశెనగ నూనెలను వాడకుండా ఉండటం మేలట.. 


ఈ వర్షాకాలంలో ఊరగాయలు, చట్నీలు, ఉప్పు ఎక్కువగా ఉన్న నిల్వ పచ్చడ్లకు దూరంగా ఉండాలట.. అవి చాలా రోగాలకు దారి తీస్తాయి కాబట్టి వాటికి ఎంత దూరం ఉంటె అంత మంచిదట. బాగా వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ మరియు మాంసం తో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడమే మేలంటున్నారు న్యూట్రీషన్లు.. 


ఈ వర్షకాలంకు గాను, చేదు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. కాకరకాయ, వేప, మెంతులు మరియు పసుపు వంటి చేదు మూలికలు ఇన్ఫెక్షన్‌లను నిరోధిస్తాయి. వర్షాకాలంలో కనీసం ఒక వారంలో రెండుసార్లు నువ్వులు నూనెతో ఆయిల్ బాత్ చేసుకోవడం వల్ల శరీరానికి చాలా మంచిదట. ఈ వర్షాకాలం లో మనం వద్దనుకున్నా కూడా చాలా రోగాలు మనల్ని తరుముతాయి కాబట్టి మనం శుభ్రంగా ఉండటం మేలు..  


మరింత సమాచారం తెలుసుకోండి: