సాధార‌ణంగా కర్బూజ తెలియ‌ని వారుండ‌రు. క‌ర్బూజ దోస జాతికి చెందిన పండు. అయితే వీటిని కొన్నిసార్లు తాజాగా, మరికొన్నిసార్లు ఎండబెట్టి వినయోగిస్తారు. కర్బూజ వేసవిలో విరివిగా దొరుకుతుంది. ఒకింత చవకగానూ లభిస్తుంది. కాబట్టి చాలా మంది దీన్ని తింటుంటారు. ఈ పండు వేసవిలో మంచి చలువ చేయడమే కాకుండా, క్యాలరీలు లేని తీపిదనాన్ని ప్రసాదిస్తాయి. లేత నారింజ రంగులో వుండే గుజ్జు రుచిగా వుంటుంది. ఈ గింజల్ని కూడా ఎండబెట్టిన తర్వాత ఒలుచుకుని తింటారు. రకరకాల పంటల్లో వాడతారు.


దీనిలో పీచు ఎక్కువ, తీపి తక్కువ. అందుకే డయాబెటీస్ రోగులకు చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా క‌ర్బూజ‌ చాలా రకాల సమస్యల నివారణకు సూచిస్తారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మలబద్దకం, మూత్రనాళ సమస్యలు, ఎసిడిటి, అల్సర్‌ వంటి పరిస్థితుల్లో ఈ పండు గుజ్జును తగినంత నీటిలో కలిపి తాగితే మంచి మేలు చేస్తుంది. ఒక కప్పు కర్బూజ ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్‌ లభిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరి చేరవు.


అల్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది. కర్బూజలో ఉండే విటమిన్ `సి`తో వ్యాధినిరోధకతను సమకూర్చి ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.  అంతే కాదు, కిడ్నీలలో రాళ్లు రాకుండా నివారిస్తూ, వృద్ధాప్యంలో ఎముకల బలానికి తోడ్పడతాయి.  వీటిలో పొటాషియం అధికంగా వుంటుంది. దీని వల్ల రక్తపోటునీ మెరుగు పరుస్తుంది. శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయి.. ఆకలి పెంచుతాము.. అలసట తగ్గిస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: