ఈ మధ్య కాలంలో మనుషులు డబ్బు మీద వ్యామోహం తో కూర్చొని ఉన్న పనులను చేస్తూ వస్తారు.. అలా వారు రోజు  మొత్తంలో ఎంతసేపు మీ శరీరానికి పని చెప్తున్నారు లాంటివి మీరు తప్పక అంచనా వేసి దాన్ని బట్టి మీ దిన చర్యను పాటించాలట. మీరు ప్రతి రోజు శారీరక వ్యాయామం చేస్తున్నా సరే ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసినా లేదా ఏ పనిచేయకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకున్న మీ శరీరాన్నీ మీరే అకాలమరణం వైపు తీసుకెళ్తున్నారని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఒక రోజులో గంట నుండి రెండు గంటల వరకు వ్యాయామం చేసినా కచ్చితంగా రోజు మొత్తంలో ఎక్కువ సేపు కూర్చొకోడదంట రోజు మొత్తంలో 12 గంటల పాటు కూర్చొని పనిచేస్తున్న వారిలో గుండెజబ్బులతో ఎక్కువగా మరణిస్తారట. దీనికి చిన్న, పెద్ద, ఆడ, మగ విబేధాలు ఉండవట ఎవరైనా ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తే త్వరగా మరణం సంభవిస్తోందట. అమెరికాకు శాస్త్రవేత్తలు  చేసిన ప్రయోగంలో ఈ విషయం వెల్లడైందట. దాదాపు వివిధ రకాల వయసు కలిగిన ఎనిమిదివేల మందిని ఎంపిక చేసి వారి జీవన శైలిని, శారీరక శ్రమను, వారి శరీరంలో వస్తున్న మార్పులను నాలుగేళ్లపాటు క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్నీ వెల్లడిస్తున్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు .
 

‘వారి పరిశోధనల్లో తేలిన ప్రతి అంశాన్ని 2000 సంవత్సరం నుండి 2012 వ సంవత్సరం వరకు ఆస్ట్రేలియా దేశం లో మానవులకు సంబంధించిన ముఖ్యమైన 36 వ్యాసాలలోని అంశాలతో వీరి పరిశోధనల్లో తేలిన వాటిని కంపార్ చేసి చూస్తే తమ అధ్యయనం వివరాలు వాస్తవమేనని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. మనకున్న 24 గంటల సమయంలో సగానికి పైగా మన శరీరానికి శారీరక శ్రమ ఉండాలని అమెరికా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. వారి అధ్యయనంలో పాల్గొన్న ఎనిమిది వేల మందిలో వారి శారీరక శ్రమను కొలవడానికి ‘యాక్సిలెరోమీటర్లు’ ఉపయోగించారట. ప్రస్తుతం బ్రిటన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య నియమాల ప్రకారం ప్రతి ఒక్కరు వారానికి 150 నిమిషాలు, అంటే రోజుకు 30 నిమిషాల చొప్పున ఐదు రోజులపాటు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలట. అంటే వారానికి 300 నిమిషాలు అంటే రోజుకు గంట చొప్పున 5 రోజులు శారీరక శ్రమ చేసినా సరిపోదని ఆస్ట్రేలియా వ్యాసాలు సూచిస్తున్నాయి. అందుకనే అమెరికా అధ్యయనాల ప్రకారం రోజుకు 12.30 గంటలు శారీరక శ్రమ ఉంటే మంచిదని సూచిస్తున్నారు.


ఇక్కడ శారీరిక శ్రమ అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు. ఒక్కోచోట శరీరాన్ని అలా కుర్చోనివ్వకుండా కదలికలు వచ్చేలా చూసుకోవాలట. మీరు పనిచేసే ఆఫీసయినా, ఇళ్లయినా అదేపనిగా ఒక్కచోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడడం, నడవడం లాంటివి చేయాలట. మీ కొలిగ్స్ తో కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ పనిచేయాలని సూచిస్తున్నారు. రోజులో మంచినీళ్లు వీలైనంత ఎక్కువుగా తాగాలట . టీ , కాఫీ లు మన క్యాబిన్ దగ్గరకు తెప్పిచ్చుకోకుండా మీరే స్వయంగా మెట్లుఎక్కి వెళ్లి తెచ్చుకోవడం మంచిదని చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత కొద్దిసపు నడవాలి. కొద్దీ దూరంలో ఉన్న హోటల్‌కో, మెస్‌కో నడుచుకుంటూ వెళ్లి తినండి బైక్స్, కార్స్ ఇవన్నీ కొంచం ఏవైడ్ చేయడం మంచిదట. మీ ఇంట్లో కూడా మంచాలపై, సోఫాలపై, కుర్చీలపై ఎక్కువ సేపు కూర్చోకుండా వీలైనంత సేపు కింద నేలపై కూర్చోని పని చేసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు


చూసారుగా కూర్చొని ఖర్చు లేకుండా చేస్తున్నాము కదా.. అని అపోహలో ఉంటారు. అలా చేయడం వల్ల ఎంత సమస్యలు తలెత్తుతాయి అందరికి తెలిసిన విషయమే. అందుకే.. రోజు మొత్తంలో మీకు వీలైనంతలో శరీరాన్ని ఏదో ఒక శారీరక వ్యయం చేయడం ద్వారా గుండె జబ్బుల నుండి దూరంగా ఉండవచ్చని పరిశోధనల్లో తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: