సాధారణంగా ఏవరైనా చర్మ సౌందర్యం కోసం చాలా చిట్కాలు వాడుతుంటారు. అలంటి వారి కోసమే చర్మ సౌందర్యం కోసం కొన్ని చిట్కాలు అందిస్తున్నాము. అందరు సాధారణంగా మజ్జిగను వేసవి కాలంలో అమితంగా తీసుకుంటారు. వడదెబ్బ నుంచి త్వరగా బయటికి రావడానికి మజ్జిగ తాగమని సలహా కూడా ఇస్తుంటారు. అంతే కాదు... ఈ మజ్జిక కేవలం ఆరోగ్యానికే కాదు.. చర్మానికీ కూడా బాగా ఉపయోగ పడుతుంది.


మజ్జిక ఏయే కారణం ఎందుకుంటే ఇందులో ఉండే కెలోరీల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, వ్యాధినిరోధక శక్తి మాత్రం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గును లాంటి వ్యాధులకు దరిచేరనీయకుండా చేయడంలో మజ్జిగ దివ్యౌషధంగా ఉపయోగించవచ్చు. అలాంటి మజ్జిగతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అదెలాగో చూదామా మరి .


ముందుగా మజ్జిగను మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే మృదువైన కురులు మీ సొంతం అవుతాయి. అలాగే, మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే.. కూడా చర్మ సమస్యలు లాంటివి దూరం కావడంతో పాటు మృదువైన, నిగనిగలాడే చర్మం కూడా వస్తుంది. వారానికోసారి మజ్జిగను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుందని ప్రముఖ బ్యూటీషియన్లు కూడా తెలుపుతున్నారు.


ఇక టీనేజ్ లో చాల మందికి ముఖం పై మచ్చలు వంటివి చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఈ మచ్చలు మాత్రం  అంత సులువుగా పోవు. అయితే ఇలాంటి సమస్యలకు ఆముదము ఎంతగానో ఉపయోగపడుతుంది అని  నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆముదము జుట్టు పెరగడానికి కూడా  ఎంతగానో సహాయపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక  వేడి చేసిన ఆముదమును మీ జుట్టుకి పట్టించి, షాంపూతో  తల స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి  అని తెలియచేస్తున్నారు ప్రముఖ నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: