మనిషి మనుగడకు ఫోన్ కి చాలా దెగ్గర సంబంధం అయిపోయిన రోజులలో ఒక కొత్త రోగం కూడా వచ్చేసిందంట ఇప్పుడు.ఐఫోన్‌లో వచ్చిన ఒక మెసేజ్ తనని స్వలింగ సంపర్కుడు(గే)లా మార్చేసిందని ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోరాడు. రష్యాకు చెందిన డి రాజుమిలావ్ యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ వాడుతున్నాడు. ఓ రోజు అతనికి ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసిన రోజు నుంచి అతడి ఆలోచనలు క్రమేనా మారిపోయాయి.

 ఐఫోన్‌లోని ఓ యాప్ ద్వారా లభించిన ఆ మెసేజ్‌లో ‘‘ప్రయత్నించకుండా ఏ విషయం పైనా తప్పుడు నిర్ణయం తీసుకోకండి’’ అని ఉంది. దీంతో అతడికి ఆ మెసేజ్ మీద ఆసక్తి కలిగి క్లిక్ చేయగా బిట్‌కాయిన్స్‌కు బదులు రూ.1,436,322 విలువ చేసే ‘గేకాయిన్స్’ లభించాయి. వాటిని ఉపయోగించుకొనే క్రమంలో అతడికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. స్వలింగ సంపర్కుడైన ఆ వ్యక్తితో కొన్నాళ్లు సావాసం చేయడంతో రాజుమిలావ్ కూడా గేలా మారిపోయాడు.

యాపిల్ కావాలనే నన్ను స్వలింగ సంపర్కం వైపు మొగ్గు చూపేలా చేసింది. 2017 నుంచి నాకు గేకాయిన్స్ అందిస్తోంది. దీనివల్ల నేను స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డాను. ఈ విషయం నా తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి? నేను నైతికంగా, మానసికంగా ఆందోళనకు గురవ్వుతున్నా. అందుకే, ఆ సంస్థపై కోర్టులో దావా వేశాను’’ అని తెలిపాడు. వాస్తవానికి ఆ మెసేజ్ యాపిల్ సంస్థ నుంచి రాలేదు. యాపిల్‌ కోసం పనిచేస్తున్న ఓ థర్డ్ పార్టీ సంస్థ ఈ యాప్‌ నిర్వహిస్తోంది.

అయితే, రాజుమిలావ్ మాత్రం యాపిల్ సంస్థ వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందని వాదిస్తున్నాడు. ఈ కేసు అక్టోబరు 17న మాస్కో కోర్టులో విచారణకు రానుంది. ఇటీవల పెన్సిల్వానియాకు చెందిన 

ఓ వ్యక్తి కూడా ఇదే విధంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై దావా వేశాడు. ఆ సంస్థ ఉత్పత్తి వాడటం వల్ల అతడికి మహిళల్లా వక్షోజాలు పెరిగాయి. ఈ కేసును విచారించిన కోర్టు బాధితుడికి రూ.56వేల కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇది ఇలానే కొనసాగితే ఇంక ఐఫోన్ కొనే వారి పరిస్థితి  ఇలానే అవ్వనుందా అని కూడా అందరి మనసులో నాటుకుపోతున్న  అంశం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: