తెలంగాణలో డెంగ్యూ, విష జ్వరాలు వ్యాప్తి చెందడంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ వైద్యులను హెచ్చరించారు. 2019-20 బ్యాచ్ ఇ ఎస్ ఐ సి  వైద్య విద్యార్థులచేత గవర్నర్  శుక్రవారం హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు. 2019-20  విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరచిన 19 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ధృవీకరణ పత్రాలను  అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..రోగుల పట్ల శ్రద్ధ వహించాలని, వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య విద్యార్థులకు  గవర్నర్ తమిళిసై దిశా నిర్దేశం చేశారు.



మెడికల్ కాలేజీని దేశంలో ప్రముఖ కళాశాల గా తీర్చిదిద్దినందుకు కళాశాల వారిని  అభినందించారు.  2016 నుండి ఇ ఎస్ ఐ సి మెడికల్ కాలేజీ ప్రాంగణం ప్లాస్టిక్ రహితంగా ఉండటం పట్ల డా. తమిళిసై సౌందర రాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఇఎస్ఐసి  మెడికల్ కాలేజీని 4 సంవత్సరాల వ్యవధిలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా మార్చడంలో డీన్ శ్రీనివాస్ చేసిన కృషిని ప్రశంసించారు.



అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రతిభను కనబరచి నందుకు గవర్నర్ బండారు  సంతోషం వ్యక్తం చేశారు. అమ్మాయిలు నిర్భయంగా ఉండాలని వారి వృత్తిలో రాణించమని సూచించారు.అంతకుముందు ఇఎస్ఐసి ఆర్థిక కమిషనర్ సంధ్య శుక్లా స్వాగతోపన్యాసం చేశారు. డీన్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ ,రిజిస్ట్రార్ డాక్టర్ మాధురి, ఇఎస్ఐసి మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ కుమార్ తో  పాటు ఇతర సిబ్బంది , వైద్య విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: