టెక్నాలజీ పెరిగింది.. రోగాలు పెరిగాయి.. దానితో హాస్పిటల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. ఈరోజుల్లో పని ఒత్తిడి కారణంగానో, స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం వలనో, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వలనో ఎక్కువమంది తలనొప్పి భారిన పడుతున్నారు. మీరు ఎక్కువ సేపు నిద్రపోయిన, నిద్ర పోకున్న తలనొప్పి వెంటనే వస్తుంది. అసలే ఇప్పుడు శీతాకాలం..బయట గడ్డకట్టుకు పోయే చలితో పాటు ఈ కాలంలో వీచే వీదురు గాలులు వలన కూడా మనకు తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ తలనొప్పిరాగానే ఎక్కువమంది మందులు షాప్ వెతుక్కుంటూ వెళ్లి మరి టాబ్లెట్స్ కొని వేసుకుంటారు. కానీ మనం ఎక్కువగా టాబ్లెట్స్ పై ఆధారపడడం వలన మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముంది. అందుకే మేము ఈ కింద చెప్పిన చిట్కాలను ఫాలో అయితే మీ తలనొప్పితోపాటు మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.


తలనొప్పి ఎక్కువగా ఆల్కహాల్ అలవాటున్న వారికి వస్తుందని ఇటీవలే జరిగిన సర్వేలలో తెలిసింది. కాబట్టి మద్యం సేవించే అలవాటుకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా తలనొప్పి ఒక దమ్ము పీలిస్తే తగ్గిపోతుందని పొగరాయుళ్లు అంటుంటారు. కానీ అది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చిన అది పూర్తిగా మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందట.


సాధారణంగా రోజుకు 5 లీటర్లు నీరు తాగకపోతే అది తలనొప్పికి దారితీస్తుందట. కాబట్టి మీరు నీరు ఎక్కువగా తాగడం మంచిది. అంతేకాకుండా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో తాజా నిమ్మరసం కలిపి తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గించుకోవచ్చట.
 

జలుబు చేసినప్పుడు కూడా తలనొప్పి బాధిస్తుంది..అప్పుడు మంచి నీళ్లలో కొన్ని ధనియాలు, చక్కెర కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.
తలనొప్పి భారం ఎక్కువగా ఉండేవారు.. చాక్లెట్లు, మాంసాహారం, జంక్ ఫుడ్‌, వెన్నకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
మద్యం ప్రియులు.. మద్యాన్ని మానక పోతే తప్పదు భారీ తలనొప్పి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: