సాధార‌ణంగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్  చేసుకోవడానికి బద్ధకం అనిపిస్తే నాలుగు బ్రెడ్ పీసులపై జామ్ పూసేసి తినేయడం కొందరికి అలవాటు. జ్వరం వస్తే పాలలో బ్రెడ్ ముక్కలు వేసుకుని తినడం మరికొందరు చేసే పని. అయితే ఇలాంటి వారంద‌రికి ఓ చేదు వార్త‌. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవులను ముప్పుతిప్పలు పెడుతున్న వ్యాది ఏదంటే కాన్సర్ అనే సమాధానమే టక్కున వస్తుంది. ఇలాంటి ప్రాణాంతక వ్యాధి సోకదానికిమార్గాలు అనేకం.


అయితే ఓ ఆధ్య‌య‌నం ప్ర‌కారం దాదాపు అన్ని ప్రముఖ బ్రాండ్ల బ్రెడ్‌ నమూనాల్లోనూ క్యాన్సర్‌ కారక రసాయనాలున్నట్లు తేలింది. ఈ క్ర‌మంలోనే బ్రెడ్, బ‌న్ లాంటివి తింటే కేన్సర్ వస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 38 బ్రాండ్లను పరిశీలించగా 84 శాతం బ్రెడ్, బన్, బర్గర్, పిజ్జాల తయారీలో ప్రమాదకరమైన పొటాషియం బ్రొమేట్, పొటాషియం ఐడేట్ వాడుతున్నారని తేలింది.


దీని కారణంగా కిడ్నీలో ట్యూమర్లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అనేక దేశాలు పొటాషియం బ్రొమేట్, పొటాషియం ఐడేట్ వాడకాన్ని నిషేధించాయి. అలాగే బర్గర్లు, పిజ్జాలు ఆరోగ్యానికి మ‌రింత హాని చేకూర్చుతాయి. సో.. వీల‌నంత వ‌ర‌కు బ్రెడ్‌, బ‌న్  బర్గర్, పిజ్జాలకు దూరంగా ఉండ‌డం చాలా ఉత్త‌మం.


మరింత సమాచారం తెలుసుకోండి: