జలుబు చేసిందని ఓ ప్రేవేట్ హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చిన వివాహిత మరణించిన ఘటన హైదరాబాద్ లోని  కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి పంపటి శేఖర్ తెలిపిన సమాచారం మేరకు... సంగారెడ్డి జిల్లా , గొర్రెకళ్ళు గ్రామానికి చెందిన స్వాతి (18)కి ఈ ఏడాది జూన్ లో అదే జిల్లా కల్పగూర్ గ్రామానికి చెందిన సుంకరి నవీన్ కుమార్ తో వివాహం జరిగింది. ఈ నెల 16న మృతురాలు స్వాతికి తీవ్రంగా జలుబు తో టాన్సిల్స్  రావడంతో కాచిగూడ లోని సీసీ షారఫ్ హాస్పిటల్ కు తన భర్తతో వచ్చింది.



అక్కడ పేషంట్స్ ఎక్కువగా ఉండటంతో అదే హాస్పిటల్ లో పని చేస్తున్న ఈఎన్టీ స్పెషలిస్ట్ డా. రామకృష చైతన్యపూరి లోని అతని ప్రేవేట్ క్లినిక్ కు రావాల్సిందిగా తెలిపాడు. దీనితో అక్కడికి వెళ్లి టెస్ట్ లు చేయించుకున్న స్వాతికి ఆపరేషన్ చేయాలని డాక్టర్ రామకృష్ణ తెలిపాడు. అరపేషన్ ను కాచిగూడ లోని సీసీ షారఫ్ హాస్పిటల్ లో చేస్తామనడంతో స్వాతి అతని భర్తతో కలిసి గురువారం హాస్పిటల్ కు వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆపరేషన్ కోసం స్వాతిని తీసుకెళ్లిన వైద్యులు ...మూడు గంటల తరువాత వచ్చి ఆమె శరీరం వైద్యానికి సహకరించడం లేదని ఐసియు కు మర్చినట్లు తెలిపారు.




సమయం అవుతున్న వైద్యుల నుండి సమాధానం రాకపోవడంతో మృతురాలి బంధువులు డాక్టర్లను నిలదీశారు. దీనితో సాయంత్రం 6 గంటలకు స్వాతి మరణించిందని చెప్పి వైద్యులు అక్కడి నుండి జారుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే స్వాతి మరణించిందని ఆమె బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తన కూతురు మరణానికి కారణమైన డా. రామ కృష , అనస్తీషియా స్పెషలిస్ట్ డా.మల్లికార్జున లపై ఆయన కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: