ఏదైనా ఎంత వరకు అవసరమో అంత వరకే తీసుకోవాలి. అటు ఇటు అయ్యుందా.... ? మీ పని అంతే. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే కోరుకుంటారు. మరి అలా జీవించాలంటే శరీరానికి తిండి ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం అవుతుంది. మనిషికి నిద్ర ఎంత అవసరమో.. అదే నిద్ర ఎక్కువైతే కూడా అంతే ప్రమాదం ఉంది.  మీకు ప్రతి రోజు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయే అలవాటుంటే మాత్రం వెంటనే మార్చుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. రోజులో ఎక్కువగా అంటే  8 గంటలకు మించి   నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 


ఎలాగో తెలుసుకోవాలని ఉందా? మనిషి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవటం చాలా  ముఖ్యం. కొంత మంది పగటి పూట ఎలాంటి పనిపాట లేకుండా జీవిస్తూ రాత్రి పగలు నిద్రించే వారు కూడా ఉంటారు. రోజులో ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు 8 గంటలకు మించి నిద్రపోతే మొట్ట మొదటగా శరీరంపై ప్రభావం చూపుతుంది. దాంతో బరువు పెరుగుతారు.

అవును  అధిక నిద్ర మీ బరువును పెంచుతుంది. చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల డయాబెటిస్ మరియు ఊబకాయంతో సంబంధం కలిగి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బరువు పెరగడం వల్ల ఎలాటి సమస్యలు ఎదుర్కోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా? సరే బరువు మాట పక్కన పెడితే.... ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది.

అసలే ఉన్న బ్రెయిన్ ని సరిగా వినియోగించుకొంటూ ఇక ఇలా నిద్ర పోయి  మొదడు సామర్థ్యం తగగ్గిపోతే ఎలా చెప్పండి? దానికితోడు  మెమరీ సామర్థ్యం కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది. అలా జరిగితే ఉన్న తెలివితేటలు కూడా హుష్ కాకి అవుతాయని పరిశోధకులు అంటున్నారు. మరి మీ ఇష్టం బాగా నిద్రపోయే ఉన్న బ్రెయిన్ పోగొట్టుకుంటారో.... లేదా ఏదోఒక పని చేసుకుంటూ శరీరానికి పని చెప్తారో మీ ఇష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: