ఇదంతా ఫేక్ యుగం... అంటే కలికాలం కదా ప్రతిదీ కల్తీనే.  తీయ్యగా ప్రాణాలు కూడా తీస్తు, మెల్లగా అనారోగ్యం పాడుచేస్తూ....  మంచానికే పరిమితం చేసి చివరకు కాటికి చేరుస్తోంది.  అంతర్జాతీయంగా భారత్ పరువును బజారుకీడుస్తూ....  తీయటి తేనెను విషంగా మారుస్తున్నారు విక్రయదారులు.రోజురోజుకు విస్తరిస్తున్న హనీ మాఫియా... ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలాంటి వారు వందల సంఖ్యలో ఇప్పుడు రోడ్ల పక్కనే చేరి కల్తీ తేనె విక్రయాలు జరుపుతున్నారు. 

 మనం నిత్యం ఉపయోగించే సబ్బుల తయారీలో కూడా తేనె వినియోగం చాలానే ఉంది.  అలాగే కాస్మోటిక్స్ మెడిసిన్స్ తో పాటు హోమియోపతి, ఆయుర్వేద మందులలో తేనె వాడకం ఎలా ఉంటుందో తెలిసిందె.  చర్మ సంబంధ వ్యాధులను నయం చేసే గుణం తేనెలో ఎంతగానో ఉందని మన తాత ముత్తాతలు చెప్పేవాళ్ళు.దీనివల్ల లెక్కకు మించిన ప్రయోజనాలున్నాయని తేనెను వాడడం విపరితంగా పెరిగిపోయింది. అందుకే ఇప్పటికి మనం  ముఖంలో మెరుపు కోసం తేనెను వాడతున్నాం. ఇదే అదునుగా తేనెకున్న డిమాండ్ ని గమనించి హనీ మాఫియా రెచ్చిపోతోంది.


 యథేచ్ఛగా నకిలీ తేనెను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాలు పెరిగిపోతున్నాయి.  బెల్లం, చక్కెర, మక్కజొన్న రసం, గ్యాస్ట్రిక్ సోడా, సోడియం బైకార్బోనేట్, అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించి అతి ప్రమాదకరమైన తేనెను విచ్చల విడిగా తయారు చేస్తున్నారు.  బెల్లం చక్కెరను మరగబెట్టి ఈ రసాయనాలన్నిటినీ అందులో కలుపుతున్నారు. విషయం ఏంటంటే మొక్కజొన్న రసం వాడకం వల్ల నకిలీ తేనె పాడవుకుండా ఎక్కువ కాలం ఉంటుంది.

తియ్యదనంతో పాటు రంగులో ఏమాత్రం అనుమానం రాకుండా అసలు తేనెకు తీసుకోకుండా తయారు చేసి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. దీన్ని వాడటం వల్ల తాత్కాలికంగా బాగానే ఉన్నా క్రమేపీ ఆరోగ్యం దెబ్బతిని చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇంకా రోడ్డు మీద చీప్ గా వస్తుందని కల్తీ తేనే కొంటారా? అలా అని స్టికర్ వేసిన ప్రతీది ఒరిజినల్ కానక్కర్లేదు. అందుకే స్వచ్ఛమైన తేనే కావాలంటే ఎం చేయాలి, ఎలా ఈ మాఫియా అరికట్టాలి ఆలోచించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: