ప్ర‌స్తుత కాలంలో మందు, చిందు సర్వసాధారణం అయిపోయాయి. మద్యసేవించడం ఆరోగ్యానికి హానికరం అని చాలా యాడ్స్ వస్తున్నే ఉంటాయి. అయినా కానీ మద్యం సేవించడం మాత్రం మానివేయారు. అయితే రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడూ త్రాగేవారైన కూడా వారిలో ఆరోగ్యం సమస్యలు ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యలు వెంటనే ప్రభావం చూపించకపోయినా, వినియోగం పెరిగే కొద్ది దాని దుష్ర్పభావాలు భవిష్యత్తులో ఎక్కువగా ఎదుర్కోవల్సి వస్తుంది. అదే విధంగా మందు తాగితే లావు పెరుగుతారా? అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంటుంది.


వాస్త‌వానికి మందు సేవించుటప్పుడు మందులోని కాలరీలతోపాటు అధికంగా తీసుకునే ఆహార పదార్థాల వల్ల అధికంగా కాలరీలు మన శరీరంలోకి చేరి కొవ్వుగా మారి లావు అవుతారట. మద్యం తీసుకునేటప్పుడు అతిగా తినే ఆహారం మొత్తం కొవ్వుగా మారి.. మద్యంలోని కొవ్వు జతచేసి తొందరగా లావు ఎక్కుతారని ప‌రిశోధ‌న‌లో తేలింది. రక్తంలో మద్యం ఎక్కువైతే గ్లూకోజ్‌ను నియంత్రించే మన శరీరంలోని గ్లూకోగాన్ హార్మోన్ పనిచేయక షుగర్ వ్యాధి కూడా అతి తొందరగా రావడానికి ఛాన్స్ కూడా ఉంది.


అదే విధంగా మ‌ధ్యం ఎక్కువగా తీసుకోవటం వల్ల సాధారణంగా రక్తంలో కొవ్వు పదార్ధం మరియు శరీరం యొక్క రక్తపోటు పెరుగుతుంది.రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది గుండెను ప్రభావితం చేస్తుంది.ఆల్కహాల్ వల్ల ప్రత్యక్షంగా కంటి చూపును మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం సంభవిస్తుంది.మెదడు యొక్క నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. సో.. బీ కేర్‌ఫుల్‌..!


మరింత సమాచారం తెలుసుకోండి: