సాధార‌ణంగా చాలా మందికి మార్నింగ్ లేవ‌గానే టీ లేదా కాఫీ తాగే అల‌వాటు ఉంటుంది. అయితే మార్నింగ్ టీ, కాఫీల వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్యం ప‌క్క‌న పెడితే.. మార్నింగ్ లేవ‌గానే జీలక‌ర్ర వాట‌ర్ తాగితే వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు అన్నీ.. ఇన్నీ కావు. ఇక    జీలకర్ర గురించి అందరికీ తెలిసిందే. వంటల్లో మంచి రుచిని, వాసనని అందించే ఈ జీలకర్ర ఆరోగ్యానికి కూడా కావాల్సినంత భరోసా ఇస్తుంది. దీంట్లో అనారోగ్య సమస్యలను తరిమికొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 


అయితే ప‌ర‌గ‌డుపున జీల‌క‌ర్ర వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది. కడుపులో ఉన్న పరుగులు చనిపోతాయి. డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు మంచి ఔషధం. మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీల‌క‌ర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో రక్తస‌ర‌ఫ‌రా మెరుగు ప‌డటమే గాక రక్త నాళాల్లోని అడ్డంకులు తొల‌గి గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.


జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు క్షీర గ్రంథులను ఉత్తేజం చేస్తాయి. అందుకే జీల‌క‌ర్ర నీటిని తాగితే గ‌ర్భిణీల‌కు పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి. ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. జీలకర్రలోని స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలురోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తాయి. జీల‌క‌ర్ర నీటిని తాగితే డ‌యేరియా త‌గ్గుతుంది. రోజంతా శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: