సాధార‌ణంగా సోంపును కొంతమంది వంటలో, తాంబూలంలో, మాంసాహార వంటకాలలో కూడా వాడతారు. అయితే ప్రతి ఒక్కరు ఎక్కువ‌గా ఆహారం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వడానికి సోంపుని తింటూ ఉంటారు. వాస్త‌వానికి సోంపు ఒక ఔష‌ధ‌మంలా ప‌ని చేస్తుంది. చిన్న పిల్లలలో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొడిచేసి తినిపించినా లేదా పొడిచేసి నీళ్ళలో ఒక గంట ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చినా కడుపునొప్పి, గాస్ట్రిక్ ట్రబుల్ తగిపోతాయి. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.


నులి పురుగులు పడిపోతాయి. కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులలో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి సోంపు ఉపయోగపడుతుంది. రక్తహీనత ఉన్నవారు సోంపు నీటిని తాగితే మంచిది. సోంపును తీసుకోవ‌డం వ‌ల్ల‌ చాలానే పోషకాలు పొంద‌వ‌చ్చు. విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాపర్, పాస్ఫరస్,  థయమిన్, జింక్, విటమిన్ ఎ, రైబోఫ్లావిన్, నియాసిన్, పీచుపదార్థంతో పాటు కొద్ది మొత్తంలో క్యాలరీలు సైతం లభిస్తాయి.


సోంపు గింజల్లో పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తం లో కొవ్వు శాతం ఆరోగ్యవంతమైన స్థాయిల్లో ఉంటుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు మరియు గుండెపోటు రాకుండా ఇది నియంత్రిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు సోంపులో ఉన్నాయి. సోంపు ద్వారా మనకు అందే పొటాషియం, మాంగనీస్ సైతం ఎముకలు దృఢంగా మారేందుకు దోహదం చేస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: