ఇటీవల కాలంలో మారుతున్నా ఆహార అలవాట్లలో వయస్సుతో ప్రమేయం లేకుండా మధుమేహం వ్యాధి బారినపడుతున్నారు. పని ఒత్తిడి, సమయ పాలన లేని ఆహారపు అలవాట్లతో కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తగిన ఆహార నియమాలను పాటిస్తే.. మధుమేహం నుంచి దూరంగా ఉండవచ్చని చెప్పే ప్రయత్నమిది. మధుమేహము తగ్గాలంటే ముఖ్యంగా ఆహారంలో మార్పులు తీసుకురావాలి. మందుల ద్వారా  మధుమేహం శాశ్వతంగా తగ్గదు. కొన్ని రకాల, ఆకులు కషాయాలు  తీసుకోవడం ద్వారా, సిరి ధాన్యాలు తీసుకోవడం ద్వారా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఈ టైం టేబుల్ ప్రకారం మీరు ఆహార నియమాలు పాటిస్తే, మీ మధుమేహం త్వరగా తగ్గిపోతుంది.


దినచర్య ఈ విధంగా ఉండాలన్న మాట.. ఉదయం లేవగానే పరగడుపున రాగి బిందె లోని  రెండు గ్లాసుల నీళ్లు త్రాగాలి.  నాభి పైభాగములో బొటన వేలుతో గట్టిగా ఒత్తిడి చేస్తే మోషన్స్ ఫ్రీ గా వస్తాయి.
పకృతి సిద్ధంగా లభించే ఆకులతో కషాయాలు ఏంటంటే..
1 వారం తిప్పతీగ కషాయం
2 వారం మెంతిఆకు కషాయం 
3,వారం నేరేడు ఆకు కషాయం
4,వారం మునగాకు కషాయం.
5,వ వారం తమలపాకు కషాయం 
6,వ వారం పుదీనా ఆకుల కషాయం
ఉదయం సాయంత్రం రెండు పూటల ఆహారం తినడానికి ముందు ఒక గ్లాసు నీళ్లలో ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దానిలో తాటి బెల్లం కలిపి సేవించండి. ఒక వారం రోజులు ఒకే రకమైన ఆకుల  కషాయాలు వాడండి.



సిరి ధాన్యాల లో ఏదైనా ఒక రకముది. అల్పాహారం ఇవ్వండి. సిరి ధాన్యాలతో, ఇడ్లీ, దోశ, చపాతి ఉప్మా చేసుకుని తినవచ్చు. జావ చేసుకొని త్రాగవచ్చు. అవేంటంటే..
కొర్రలు రెండు రోజులు
సామేలు రెండు రోజులు 
ఊదలు రెండు రోజులు
అరికలు రెండు రోజులు
అండు కొర్రలు  రెండురోజులు
పది రోజులు తర్వాత మరల మార్చి అదేవిధంగా తినాలి.
తినకూడనివి ఏంటంటే.. మాంసాహారం ,మద్యపానం,దూమపానం గుట్కా పాన్ మసాలా లు, అన్నము ఇడ్లీ దోసె చపాతీ, కార్న్  ఫ్లోర్  ,మైదాతో చేసినవి తినకూడదు, టీ కాఫీలు పాలు తాగ కూడదు. పిజ్జా బర్గర్లు బేకరీ ఐటమ్స్  ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ వంటి వాటిని వాడకూడదు.15 నిముశాలు ఇష్టదైవం ధ్యానం చేయాలి


మరింత సమాచారం తెలుసుకోండి: