బరువు తగ్గాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ వారికీ ఉన్న ఆహార అలవాట్ల కారణంగా వారు బరువు తగ్గటం చాల కష్టంగా ఉంది. బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన అసలు తగ్గారు. ఒకవారం పాటు ఆహారం మానేసి డైటింగ్ చేసిన ఆహారానికి బానిసలూ కావడం కారణంగా మళ్ళి యధావిధిగా లావు అయిపోతున్నారు. 


కొంతమంది డైటింగ్ చేస్తారు.. మరి కొంతమంది జిమ్ కి పోతారు.. ఇంకా మరి కొంతమంది అయితే న్యూట్రి పౌడర్ అని ఉపయోగిస్తారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే ఊబకాయం ఉన్న వాళ్ళు.. అది రాకూడదు అని అనుకున్న వాళ్ళు ఈ నాలుగు రకాల జ్యూస్ లు తాగితే బరువు యిట్టె తగ్గిపోతారు. 


దాల్చిన చెక్క టీ రోజూ ఒక కప్పు తాగితే అధిక బరువు సమస్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ కప్పు టీ ఉదయం, సాయింత్రం తీసుకుంటే అధిక బరువు తగ్గటం మొదలవుతుంది. 


'గ్రీన్ టీ'లో చిటికెడు అల్లం తురుము కలిపి పరగడుపున తాగాలి. కాస్త వగరుగా ఉండే ఈ పానీయాన్ని ఉదయాన్నే తాగలేకపోతే చెంచా తేనె కలుపుకోవలి. ఇలా తాగడం వల్ల లావు తగ్గుతారు. 


తాజా గులాబీ రేకలు నీటిలో 20 నిమిషాల పాటు మరిగించి రోజుకో అరకప్పు చొప్పున పరగడుపున తాగితే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.


2 గ్లాసుల నీళ్లలో 5 చెంచాల నిమ్మరసం, చెంచా నల్లమిరియాల పొడిని వేసి రెండు పూటలా భోజనం తర్వాత ఒక గ్లాసు తాగాలి. దీంతో కొవ్వు అతి తక్కువ కాలంలోనే కరిగి పోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: