అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అందుకే ఆహారాన్ని స్వీకరించేటప్పుడు పాటించవలసిన నియమాలను కొన్నీంటిని పూర్వకాలంలో తూచ తప్పకుండా ఆచరించేవారు. ఇకపోతే మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరం, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్యవసరం, అందుకే తినే ఆహారాన్ని ఓ క్రమపద్దతిలో స్వీకరిస్తే ఆరోగ్యం లభిస్తుంది అంటారు. అదీగాక శుభ్రంగా చేతులు కడుక్కుని బాసింపట్టు వేసుకుని ఐదు వేళ్లతో అన్నం కలిపి తింటుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.అయితే.. చేతులతో అన్నం తినేవాళ్లు వాళ్లకు తెలియకుండానే తమ ఆరోగ్యాన్ని తాము పదిలంగా కాపాడుకుంటున్నారన్న విషయం తెలుసా..


స్పూన్లతో, ఫోర్క్ తో తినే వాళ్ల కన్నా చేతులతో ఆహారాన్ని తినేవాళ్లు హాయిగా వందేళ్లు బతుకుతారట. ఎందుకంటే చేతులతో ఆస్వాదిస్తూ అన్నం తినేవాళ్లలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందట. చేతులతో అన్నం తినడం వల్ల కండరాలకు పని పెరుగుతుంది. దీంతో బ్లడ్ సర్క్యులేసన్ పెరుగుతుంది. చేతులతో అన్నం తినడం వల్ల ఫుడ్ తో ఓ బంధం ఏర్పడుతుంది. అదో ఎమోషన్... ఫోర్క్ , స్పూన్ తో తింటే ఆ ఎమోషన్ రాదు. చేతులతో తినడం వల్ల ఆహారం విలువ తెలుస్తుంది. దానితో ఓ బంధం ఏర్పడుతుంది.


ఆయుర్వేదం ప్రకారం చూస్తే .. నోట్లోకి చేతి వేళ్ల ద్వారా ఆహారాన్ని పంపించడం అనేది యోగ ముద్ర. అది జ్ఞాన అవయవాలను యాక్టివేట్ చేస్తుంది. ఆహారాన్ని చేతి వేళ్లతో తాకుతూ తినడం వల్ల… వేళ్లలో ఉన్న నరాలు మెదడు సిగ్నల్ పంపిస్తాయి. దీంతో శరీరంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన రసాలు జీర్ణాశయంలో విడుదలవుతాయి. దీంతో తిన్న ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది...వేదాల ప్రకారం చూస్తే .. మన చేతి వేళ్లకు, గుండెకు, మూడో నేత్రానికి, గొంతుకు, నాడి కూటమి, ఇతర రూట్ చక్రాలను లింక్ ఉంటుంది. అందుకే.. చేతివేళ్లతో అన్నం తినడం వల్ల వాటి పని తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా స్పూన్లు, ఫోర్క్ ల కన్నా చేతులే పరిశుభ్రంగా ఉంటాయి. బ్యాక్టిరీయా ఎక్కువగా స్పూన్లకే ఉండే ప్రమాదం ఉంది. అందుకే చేతులను శుభ్రంగా కడుక్కుని ఆహారాన్ని స్వీకరించాలని చెప్పడంలోని అర్ధం ఇదే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: