ఇటీవల సమాజంలో చాలామంది మహిళలు తమని తాము ప్రేమించుకోవడానికి, కొంత  సమయం గడపడానికి  కష్టంగా ఉంటారు. దాంతో ఒత్తిడి, చిరాకు, కోపం, అలసటా ఇలాంటివి ఎన్నో  సహజంగానే ఇబ్బంది వస్తుంది. అవే దీర్ఘకాలంలో అనారోగ్యాలకూ కారణం అవద్దం కూడా జరుగుతుంది.  వాటిని అధిగమించి వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ఆనందించాలంటే... వారంలో ఒకరోజు మీ కోసం మీరు సమయాన్ని కేటాయించుకోవడం చాల మంచిది. ఇక ప్రతి మహిళకూ వారంలో ఒక రోజు సెలవు తప్పనిసరిగా అవసరం. నిపుణులూ కూడా అదే సూచించడం జరుగుతుంది.


ఆలా సమయాన్ని కేటాయించుకోవడానికి  మహిళకూ చాలా మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దామా మరి.. అసలు ఎందుకు స్వీయ సంరక్షణ చేయాలి అంటే ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక అర్యోగం కూడా లభిస్తుంది. ఎప్పుడు భర్త, పిల్లల బాధ్యతల్లోనే సంతోషం ఉంటుంది అని అనుకుంటుంటారు. ఇక  నగలు, దుస్తులు, పూజలతోనే సమయాన్ని కదుపుతూ ఉంటారు.  వీటి అన్నిటి కంటే స్వీయ సంరక్షణ  చాల అవసరం అని అంటున్నారు మానసిక నిపుణులు.


చాల మంది మహిళలు పోషకాహారం సరిగా తీసుకోరు. వాళ్ళని వాళ్ళు అసలు పట్టించుకోరు. ఇలా చేయడం వల్లనే చాలా సమస్యల్ని తెచ్చి పెడతాయి. ఇలాంటి సమస్యలాంటిని ఎలా సంరక్షించుకోవాలి అంటే బబుల్ బాత్ లేదా స్సా చేయించు కోవడం మంచిది. అది కేవలం శరీరంపై పేరుకొన్న మురికి వదలగొట్టుకోవడానికో, అందానికి మెరుగులద్దుకునేందుకో మాత్రమే కాదు. ఇది కండరాలకు తగిన విశ్రాంతి కూడా లభిస్తుంది.


ఇంకా చాల కూడా చేయవచ్చు  వాటిలో ఇంకోటి ప్రయాణించండి.  కొందరు మహిళలు పిల్లలు, భర్త లేకుండా వెళ్లడం కుదరదు అని అంటూవుంటారు. కనీసం నెలకు ఒక్కసారి అయినా స్నేహితులతో కలిసి ఆలా బయటికి వెళ్ళవచ్చు. ఇలా చేయడం వల్ల ఉత్సాహాన్నే కాదు, ఆత్మ విశ్వాసం కూడా లభిస్తుంది.  మీకు బాగా మంచి సన్నిహితులతో కొంత సేపు ఫోను చేసి మాట్లాడండి. ఓ పదినిమిషాలు కబుర్లు చెప్పినా.. కూడా బాగా ఒత్తిడి తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: