మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రిస్తే ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాల్సి వ‌స్తుంది.  ఇక గర్భిణీలు పుల్లగా ఉండే నిమ్మ, ఊరగాయ, ఇతర పండ్లను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ముఖ్యంగా చింతకాయ‌లు కూడా ఒకటి. వాస్త‌వానికి ఔషద గుణాలను కలిగి ఉండే చింతకాయ గర్భిణులలలో కలిగే వికారం, వాంతులు మరియు ఉదయపు అలసట వంటి వాటిని తగ్గించటంలో గొప్పగా సహాయపడుతుంది. చింతకాయల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.


ఇక ఈ విష‌యం త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి చింతకాయలను తినడం వల్ల శిశువు నెలలు నిండకుండా పుట్టే స్థితి రాకుండా ఉంటుంది. అలాగే తల్లులకు జెస్టేషనల్ డయాబెటిస్ రాకుండా ఉంటుంది. గర్భిణుల శరీరంలో చేరే ఫ్రీ రాడికల్ లను నిర్వీర్యపరచటంలో చింతపండు లేదా చింతకాయ సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు శరీరంలోకి ప్రవేశించే ఫ్రీ రాడికల్ లను పుర్తిగా నివారిస్తుంది. 


చింతకాయల్లో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దకం రాకుండా చూస్తుంది. అధిక బరువు పెరగకుండా రక్షిస్తుంది. అయితే చింతపండులో ఉండే విటమిన్ సి హెల్తీ న్యూట్రీషియన్. దీన్నిడైట్ లో చేర్చుకోవడం మంచిదే. కానీ ప‌రిమితికి మించి తీసుకోవ‌డం అంత మంచిది కాదు. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందు ముందు ప్రొజెస్టరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో గర్భస్రావానికి కారణమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: