సీతాఫలం అధిక పోషక విలువలు కలిగినటువంటి పండు. ఉత్పత్తి పరంగా చూసుకుంటే మహారాష్ట్రలో (59.33 టన్నులు) మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రం 9.49 టన్నుల ఉత్పత్తితో 6వ స్థానంలో ఉంది.  ఈ పండ్లలో అధికంగా కార్బోహైడ్రేట్స్, విటమిన్-సి, విటమిన్-ఎ ఉంటాయి. ఇంకా ఈ పండు అధిక పొటాషియం, మెగ్నిషియంలను కలిగి ఉండి, గుండె సంబంధి వ్యాధులనుండి కాపాడుతాయి. ఈ పండ్లని తీసుకోవడం ద్వారా కంటికి, అజీర్తి సమస్యలకు, రక్తహీనత ఉన్నవారికి, బరువు పెరగాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటి ఆకులు, గింజలలో అనోసిన్ అనే ఆల్కలాయిడ్ ఉండడం వలన చేదు గుణం కలిగి ఉంటుంది. గింజల నుండి 27-30 శాతం దాకా నూనె లభిస్తుంది. ఈ నూనెను సబ్బు, పెయింటింగ్ పరిశ్రమల్లో వాడతారు.


శీతాకాలం రాగానే సీతాఫలాలు సందడి చేస్తాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళ చేలగట్లపై ఉంటాయి. ఊరికి దూరంగా ఉండే చిన్నపాటి అడవుల్లో విస్తరిస్తాయి. సిటీలలో వీటి చెట్ల సంఖ్య లేకపోయినా గూబ అదిరిపోయే ఖరీదుతో అమ్మకానికి సిద్దంగా ఉంటాయి. ఎంతో ఇష్టంగా అందరూ తినే ఈ సీతాఫలంలో ఎలాంటి ఆరోగ్య కారకాలు ఉంటాయి. వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.


 చర్మాన్ని, జుట్టు ని ఆరోగ్యంగా ఉంచగల శక్తి సీతాఫలంలో ఉంటుంది అందుకు గాను ఇందులో ఏ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. కంటి చూపు మెరుగు పరచడంలో, జీర్ణ వ్యవస్థని గాడిన పెట్టడంలో ఈ ఫలాన్ని మించింది మరొకటి లేదనే చెప్పాలి. శరీరంలో నీటి స్థాయి తగ్గకుండా జాగ్రత్త చేస్తుంది. రక్త హీనతతో ఇబ్బందులు పడే వారు సీతాఫలం ఎక్కువగా తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. అంతేకాదు షుగర్ లెవిల్స్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సీతాఫలం.


మరింత సమాచారం తెలుసుకోండి: