తమలపాకులు.. ప్రతి పండుగలకు, శుభకార్యాల్లో తమలపాకులు వక్కలతో ఉన్న తాంబూలానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ఈ తాంబూలం ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి మంచిది. మనం ఎదుర్కొనే అనేక చిన్న చిన్న అనారోగ్యాలకు తమలపాకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. 


ఈ తమలపాకులో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంటిలో ఉండి ఎన్నో గృహ వైద్యంలో తమలపాకు ఉపయోగాల గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి. 


దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలకు తమలపాకు మంచి ఔషధం. ఈ సమస్యలతో బాధపడే పిల్లలకు తేనె, తమలపాకు, తులసి, అల్లం రసాలను చెంచా చొప్పున పిల్లలకు ఇస్తే ఎంతో మంచి జరుగుతుంది. 


జ్వరం బారిన పడిన వారు చెంచా తమలపాకు రసంలో చిటికెడు మిరియాల పొడి కలిపి 3 పూటలా తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.


మోకాళ్ళు, కీళ్ల నొప్పి బాధితులు తమల పాకును వేడిచేసి వాపు, నొప్పి ఉన్నచోట కడితే నొప్పి తగ్గుతుంది.


గాయాలకు నెయ్యి రాసిన లేత తమల పాకుతో కట్టుకడితే రెండో రోజుకు మానటం మొదలవుతుంది.


తాంబూలంలో వాడే సున్నం వల్ల ఎముకలు గుల్లబారటం, విరగటం వంటి సమస్యలు రావు.


బోదకాలు బాధితులు రోజూ 10 తమలపాకులను ఉప్పుతో కలిపి నూరి వేడి నీళ్లతో తీసుకుంటే క్రమంగా వాపులు తగ్గుతుంది.


లావు ఉన్నవారు 2 నెలల పాటు రోజుకోసారి తమలపాకులో 5 మిరియంగింజలు పెట్టి తిని వెంటనే నీళ్లు తాగుతుంటే సన్నగా తయారవుతారు.


ఆకలి లేకపోవటం, నీరసం వంటి సమస్యలకు తమలపాకు షర్బత్ మంచి ఔషధంగా పనిచేస్తుంది.


పులిపిరుల మీద తమలపాకు తొడిమలతో తడి సున్నాన్ని 7 రోజుల పాటు పూస్తే పులిపిరులు రాలిపోతాయి.


తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: