చలి కాలం వచ్చిందంటే చాలు మన జీవనశైలి కొద్ది కొద్దిగా మారుతుంది. ఈ చలితో పాటు మనకు ఉండే బద్ధకం వాళ్ళ మనం వ్యాయామం కూడా చెయ్యం. ప్రతిరోజు వ్యాయామం చేసేవారు కూడా ఈ చలికాలంలో వ్యాయామం చెయ్యరు. ఇక ఈ రోజుల్లో జిమ్ లలో కూడా హాజరు శాతం బాగా తగ్గిపోతుంది. 


అయితే చలికాలంలో చేసే వ్యాయామం త్వరగా, మెరుగైన ఫలితాలను ఇస్తుందని అవగాహన ఉన్నవారు చలికాలంలో ఒక్కరోజు కూడా వ్యాయామం చేయకుండా ఉండలేరు. చలికాలంలో ఇంట్లో చేసుకోదగిన కొన్ని రకాల ప్రత్యేక వ్యాయామం గురించి ఇప్పుడు తెలుసుకొని చేద్దాం. 


శీతాకాలంలో బ్రిస్క్‌ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి.


ఇంట్లోనే కార్పెట్ మీద సిటప్స్, పుషప్స్, స్క్వాట్స్, చైర్ డిప్స్ వంటి వ్యాయామాలు చేయటం మంచిది. 


డ్యాన్సింగ్, స్కిప్పింగ్, స్టెప్ అప్స్ వంటి వ్యాయామాలు కూడా చేయవచ్చు.


ఈ సీజన్‌లో సూర్యోదయం తరువాత నులివెచ్చని ఎండలో వ్యాయామం ఎక్సర్‌ సైజ్‌లు చేస్తే మంచిది. 


వ్యాయామ సమయంలో ముక్కుతోనే శ్వాస తీసుకోవాలి, నోటితో తీసుకుంటే చలిగాలి తిన్నగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సమస్యలు వస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: