మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరినీ డెంగ్యూ జ్వరాలు, వైరల్ జ్వరాలు, దగ్గు జలుబు మొదలగు అనేక రోగాలు చాలా మందిని బాధ పెడుతున్నాయి. వర్షాకాలంలో నీరు పల్లపు ప్రాంతాలలో ఎక్కువగా నిల్వ ఉంటుంది.  అది కొన్ని రోజులకు మురుగుగా ఏర్పడి దోమలు వృద్ధిచెందుతాయి. ఈ దోమల వలన అనేక రోగాలు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొనుట వలన వ్యాధులు రాకుండా అరికట్టవచ్చును.


 ముఖ్యముగా మన పరిసరాలలో పరిశుభ్రంగా ఉండేటట్లు చూసు కొనుట ప్రతి పౌరుని బాధ్యత.  అలాగే మనము నిల్వచేసుకొననే నీటిని కూడా వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచితే అందులో క్రిమికీటకాలు ప్రవేశిస్తాయి. ఈ దోమల వలన అనేక రకాల జ్వరాలు రావడానికి అవకాశం ఉన్నది. ఈ జ్వరాలను కొంతవరకు నివారించడానికి మనము కొన్ని వంటింటి చిట్కాలు పాటించడం అవసరం. అందులో ముఖ్యమైనవి దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు ,సమపాళ్ళలో తీసుకుని. బరకగా పొడి చేసి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.


ప్రతిరోజు ఉదయాన్నే ఒక పాత్రలో ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఆ నీటిని బాగా మరిగించాలి. ఆ నీటిలో ఒక పావుచెంచా పొడి వేసి ఒక రెండు నిమిషాలు మరగబెట్టాలి. తరువాత వడకట్టి ఆ నీటిలో ఒక చెంచా తేనెను కలిపి వేడివేడిగా క్రమం తప్పకుండా ఒక వారం రోజులపాటు తాగితే దగ్గు, జలుబు , కపము, సైనసైటీస్, రోగాలు తగ్గడానికి అవకాశం కలదు.


  అలాగే బంతి మొక్క ఘాటైన వాసన కలిగినది. ఈ మొక్క దోమల నివారణి గా పనిచేస్తుంది. మరియు వెల్లుల్లి ఎక్కువగా తినడం వలన మన శరీరము దోమల్ని ఆకర్షించదట. అలాగే మనము పూలతో పాటు మా మాచిపత్రి అనే ఆకును కలిపి కడతాము. మాచి పత్రి కిఉండే సువాసన కూడా దోమల్ని రానివ్వకుండా చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: