రక్తనాళాలలో ప్రవహించే రక్తం గోడలపై కలిగించే ఒత్తిడే రక్తపోటు గుండె నిముషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి గుండె కొట్టుకన్నపుడు రక్తం గుండె రక్తనాళల్లోకి. ప్రవహించడానికి కారణమయ్యు ఒత్తిడిని రక్తపోటు అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 ఉండాలి. దీనికంటే ఎక్కువ వుంటే శారీరక శ్రమ చేస్తున్నపుడు, కోపంతో, భయాందోళనలతో ఉన్నపుడు. కోపంతో, నొప్పితో బాధపడుతున్నపుడు కొద్దిగా పెరగవచ్చు. ప్రశాంతంగా నిద్రపోయి లేవగానే రక్తపోటు తక్కువగా ఉంటుంది. 140/90 దాటితే రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లు లెక్క, వయసు పైబడిన వారిలో 160/90 వరకూ ఉంటుంది. స్మిగ్మోమోనో మీటర్ తో రక్తపోటు కొలుస్తారు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్లో రక్తపోటు ఒకటి, గుండెనుంచి వచ్చే రక్తనాళం సన్నగా ఉండటం గుండె నుంచి వచ్చే ప్రధాన ధమని సన్నబడటం, గుండె నుంచి వచ్చే ధమని సన్నబడటం, మూత్రపిండాలకు రక్తం సరఫరా చేసే ధమనులు సన్నటబడటం కొన్ని రకాలైన గ్రంధులు ఎక్కువగా పని చేయడం, వంద మందిలో 90 మందికి కారణం లేకుండానే ఇది వస్తుంది. మీగతా రక్తపోటు ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. వైధ్య పరీక్షలలో మాత్రమే ఇది బైటపడుతుంది. రక్తపోటు ఎక్కువ ఉంటే తలనొప్పి, దడ, ఆయాసం, అలసట, చికాకు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఇతర వ్యాధుల్లో ఉండవచ్చు. రక్తపోటు మరీ ఎక్కువైనపుడు చూపు తగ్గడం. పక్షవాతం మూత్రపిండాలు దెబ్బతినడం, గుండెపోటు, గుండె పెరగడం. వల్ల కాళ్ళవాపు, ఎగశ్వాస, కాళ్ళలో ప్రసారం తగ్గడం వంటివి జరుగుతాయి. రక్తపోటు ఉన్నవారికి లేని వారికంటే ఐదు రెట్లు ఎక్కువ గుండెపోటు వస్తుంది. కారణాలు : వందమందిలో 90 మందికి ఎ కారణం లేకుండానే రక్తపోటు వస్తుంది.. దీనిని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్లో ఒకటి. తల్లిదండ్రులిద్దరికీ ఉంటే, వారి పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకావశం ఉంది. తల్లిదండ్రులిద్దరికీ ఉంటే, వారి పిల్లలకు ఈ వ్యాధీ వచ్చే అవకాశం మరింత ఎక్కువ. ఎక్కువ బరువు ఉండటం, పొగతాగడం, మధ్యపానం, వ్యాయామం లేకపోవడం, ఆధునికి జీవనంలోని ఆందోళనలు, తగిన విశ్రాంతి లేని యాంత్రిక జీవనం రక్తపోటుకు కారణాలు. గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలలో కొద్దిమందికి రక్తపోటు పెరుగుతోంది. వాటిని ఆపగానే రక్తపోటు మళ్లీ మామూలు స్ధాయిక వస్తుంది. చికిత్స : రక్తపోటు ఉందని తెలిస్తే మొదటి వ్యాయామం బరువుతగ్గడం, ఉప్పు తగ్గించడం ద్వారా రక్తపోటు నివారించేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికీ రక్తపోటు 149/90 ఉంటే మందులతో చికిత్స ప్రారంభిస్తారు. ఈ మందులను రెగ్యులర్ గా వాడాల్సిఉంటుంది. రక్తపోటు సాధారణ స్థితికి చేరుకున్నాకా, కొంతమంది మందులు మానేస్తుంటారు. అలా మానేయకుండా జీతాంతం వాడాల్సి ఉంటుంది. ప్రతి రెండు నెలలకు డాక్టర్ ను సంప్రదించాలి. ప్రాధమిక దశలోనే రక్తపోటును గుర్తిస్తే మందులు వాడటం ద్వారా పక్షవాతం, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, దృష్టిమాంధ్యం మొదలైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కొంతమందికి చిన్న వయస్సులోనే రక్తపోటు 200/40 దాటి వేగంగా సమస్యలకు దారి తీస్తుంది. దీనిని మెలిగ్నంట్ హైపర్ టెన్స్న్ అంటారు.  జాగ్రత్తలు : ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి, శరీరక వ్యాయామం అంటే నడక, రన్నింగ్ ఈత కొట్టడం, వంటవి చేయాలి. పొగతాగడం మానేయాలి. 45 ఏళ్లు పైబడిన వారు రక్తపోటును రక్తపోటును పరీక్షించుకోవాలి. రోజుకు నాలుగు గ్రాములకంటే ఎక్కువ ఉప్పు వాడకూడదు. పూర్తిగా ఉప్పు లేని కూరలకు కొంత రుచి కలిగించడానికి నిమ్మరసం, జీలకర్ర ధనియాలు, మిరియాలు, వంటివి వాడవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: