విటమిన్ సి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, అలర్జీలు, కొన్ని రకాల సీరియస్ ఇన్ఫెక్షన్లను నిరోధించటంలో విటమిన్ ‘సి’ ప్రముఖ పాత్ర వహిస్తుంది. విటమిన్ సి లో క్యాన్సర్ నిరోధానికి పనికివచ్చే అంటీ ఆక్సిడెట్ లక్షణాలున్నాయి. పులుపు పళ్ళలో విటమిన్ సి బాగా లభిస్తుంది. నిమ్మ, నారింజ మొదలైన వాటిలో ఈ పళ్ళలో విటమిన్ సి కాకా బాయోఫ్లవోనోయిడ్స్ అనబడే మరో ముఖ్యమైన పధార్థం కూడా లభిస్తుదంది మన చర్మం. జీర్ణయంత్రాంగం, ఊపిరితిత్తులు, లివరు మొదలైన బాగాలలోని ఎంజైమ్స్ లోని క్యాన్సరు నిరోధకశక్తిని ఈ బాయోఫ్లవోనోయాడ్స్ పెంచుతుంది. క్యాన్సరు నిరోధం కోసం మీరు నిలవ వున్న పళ్ళకంటే తాజా ఫలాన్ని తీసుకోవటం మేలు. అలాగే పళ్ళరసాలు తాగటంకంటే కూడా పళ్ళని తినటమే మేలు. క్లుప్తంగా చెప్పాలంటే క్యాన్సరు రాకుండా చూసుకోవడానికి మీరు రోజూ తాజా పళ్లు ఫలాలను తీసుకోవాలి. పళ్ళను ఫ్రిజ్ బయట ఎక్కువ రోజులపాటు నిలువ ఉంచటం మంచిది కాదు. పళ్ళలోని పోషక విలువలన్నీ లభించాలంటే తాజా పండును తినటం ఉత్తమం!  

మరింత సమాచారం తెలుసుకోండి: