చరిత్ర పుటలను తిరగేస్తే సెప్టెంబర్, 12 వ తేదీన అదిల్ షాహీ   వంశం పతనమైన ఘటన  కన్పిస్తుంది. ఔరంగజేబుతో 1686 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో బీజాపూరు రాజ్యం ఓడిపోయింది. దానితో మొఘల్ సామ్రాజ్యం కలిసిపోయింది. ఆ విధంగా ఆదిల్‌షాహీ వంశ పతనమైంది. 
పండుగలు, జాతీయ దినాల విషయానికి  ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతున్నారు. మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినంగా 2008 సెప్టెంబర్ 12 తేదీని ప్రకటించారు. ఎఫ్ డిఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య రక్షణ అనే అంశంపై 1978 సెప్టెంబర్ 12వ తేదీన  అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు.



ఎప్ డిఐ వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గాడన్ 1854 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించారు. గౌస్ బేగ్ సాహెబ్, పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహం చేసి మునిసిపల్ శాసనాన్ని 1885 లో రద్దు చేయించారు. ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు సవాయి గంధర్వ 1886 వ సంవత్సరంలో   జానిమిచ్చారు. అయన 1952 లో మరణించారు.  ప్రసిద్ద సాహితీవేత్త. భావకవితా ఉద్యమ పోషకుడు తల్లావఝుల శివశంకరస్వామి 1892 లో పుట్టారు. ఈయన    1972 లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి 1920 వ సంవత్సరంలో జన్మించారు. 2005 లో మరణించారు. 
 




ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ 1925 లో పుట్టారు. అయన 2017 లో మృతి చెందారు.  ఆధునిక తెలుగు నిఘంటుకర్త రవ్వా శ్రీహరి 1943 లో జన్మించారు. రంగస్థల రచయిత మరియు నటుడు అల్లాబక్షి బేగ్ షేక్‌ 1952 లో జన్మించాడు.  ఆంగ్ల నటుడు మరియు మార్షల్ ఆర్టిస్ట్ జాసన్ స్టాథమ్ జననం 1972 లో జరింగింది. హరిత విప్లవ పితామహుడు  నార్మన్ బోర్లాగ్ 2009 లో మరణించారు.  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ 2009 మృతి చెందారు.  దక్షిణ భారత గాయని స్వర్ణలత 2010 లో మరణించారు. 1973 వ సంవత్సరంలో జన్మించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: