నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయని విషయం తెలిసిందే. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎంతోమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు అంతే కాకుండా ఎంతో మంది ప్రముఖులు జనవరి 1 రోజున తుదిశ్వాస విడిచారు. చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 

చాగంటి సోమయాజులు మరణం : ప్రముఖ సుప్రసిద్ధ తెలుగు రచయిత చాగంటి సోమయాజులు... తెలుగు ప్రజలందరికీ చాసోగా  కొసమెరుపు. ఎన్నో అద్భుతమైన కథలు కవితలు చాగంటి సోమయాజులు తెలుగు ప్రజలకు అందించారు. చాగంటి సోమయాజులు మొట్టమొదటి రక్షణ చిన్నాజీ . భారతి అనే పత్రికలో ఇది ప్రచురితమైంది. చాగంటి సోమయాజులు రాసే కథల్లో ఎక్కువగా ప్రజల బాధలు సమస్యలు  ధనస్వామ్యం వ్యవస్థ తీరు వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేవి. ఈయన రచించిన కథలు హిందీకన్నడ,  మలయాళం,  రష్యన్, మరాఠీ,  ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి. 1915 జనవరి 15న జన్మించిన చాగంటి సోమయాజులు... 1994 జనవరి 1న మరణించారు.

 

 

సోనాలి బింద్రే జననం : 1975 జనవరి 1వ తేదీన మహారాష్ట్రలోని బాంబే లు జన్మించింది సోనాలి బింద్రే.  బాలీవుడ్ లో తన సత్తా చాటుకుని ఎన్నో అవార్డులను సైతం గెలుచుకుంది సోనాలి బింద్రే. టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇంద్ర సినిమాలో అలరించిన సోనాలి బింద్రే.. ఆ తరువాత ఖడ్గం మూవీలో నటించే అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున  తో కలిసి మన్మధుడు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయింది సోనాలి బింద్రే. అంతేకాకుండా బాలకృష్ణతో పలనాటి బ్రహ్మనాయుడు... మెగాస్టార్ తో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాల్లో  నటించింది. సోనాలి  నేడు 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నది. 

 

 

 విద్యాబాలన్ జననం  : బాలీవుడ్ నటి విద్యాబాలన్ 1979 జనవరి 1న బాంబే లో జన్మించింది. విద్యాబాలన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లికించుకుంది . వైవిద్యాత్మకమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది విద్యాబాలన్. తన అద్భుతమైన నటన కు గాను ఎన్నో అవార్డులు రివార్డులను సైతం అందుకుంది విద్యాబాలన్. తాజాగా తెలుగులో కూడా నటించి తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకుంది విద్యాబాలన్. ఇక హిందీలో కూడా ఎన్నో ప్రయోగాత్మక  సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా నేడు విద్యాబాలన్ తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నది. 

 

 

 ఐశ్వర్య ధనుష్ జననం : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్. సినీ దర్శకురాలిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె గా... తమిళ హీరో ధనుష్ సతీమణిగా ఐశ్వర్య ధనుష్ సినీ ప్రేక్షకులకు కొసమెరుపు. జనవరి 1, 1982లో చెన్నైలో ఐశ్వర్య ధనుష్ జన్మించారు. 2004లో తమిళ హీరో ధనుష్ ను పెళ్లి చేసుకున్నారు రజనీకాంత్ పెద్ద  కుమార్తె ఐశ్వర్య. దర్శకురాలిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకున్నారు ఐశ్వర్య ధనుష్. కాగా నేడు ఐశ్వర్య ధనుష్ తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: