జనవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి.  ఇంకెంతో మంది ప్రముఖుల జననాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ జనవరి 4వ తేదీన చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

 

 

 ఐజాక్ న్యూటన్ జననం : భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త న్యూటన్. ప్రముఖ సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త. ప్రపంచంలోనే గొప్ప శాస్త్రజ్ఞుడు ఖగోళ శాస్త్రవేత్త న్యూటన్  ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం  సైన్సు గా ఎలా పరిణామం చెందిందో  అంశంపై ఆయన ఎనలేని కృషి చేసి  భవిష్యత్ తరాలకు ఎన్నో సూచనలు అందజేశారు. ప్రపంచం మొత్తం న్యూటన్ ను  సైన్సు పితామహుడిగా గౌరవిస్తుంది. ఈయన జనవరి 4, 1643 లో జన్మించారు. ఈయన గురుత్వాకర్షణ శక్తిని మొదటిసారి కనుగొన్నారు. ఒక ఆపిల్ చెట్టు కింద కూర్చుని యాపిల్ కింద పడిన సమయంలో నాలుగు నెలల నుంచి కిందికి పడుతుంది. ఎందుకు పైకి  వెళ్లడం లేదు అని ఆలోచించి... భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అని కనుగొన్నాడు న్యూటన్ . సూర్యకేంద్రక సిద్ధాంతాల పై ఉన్న అన్ని అనుమానాలను తొలగించడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కించారు సర్ హైజాక్ న్యూటన్ . ఈయన 1727 సంవత్సరంలో మరణించారు. 

 

 

 లూయీ బ్రెయిలీ జననం : ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ . జనవరి 4 1809 సంవత్సరంలో జన్మించారు. బాల్యంలోనే ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయాడు. అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా నుంచి.. అంధుల లిపి కోసం ఎంతో కృషి చేశారు. అందుల కోసం ఒక ప్రత్యేక లిపిని కనుగొని దానికి బ్రెయిలీ లిపి అని నామకరణం చేశారు. అంధులు తేలికగా చదవగలిగే రాయగలిగే లిపిని తయారు చేయడానికి కృషి చేశాడు. అందుల కోసం ప్రవేశపెట్టిన వ్యక్తి అధికారికంగా కూడా గుర్తింపు వచ్చింది. ఇప్పటికి  అందులు అందరు బ్రెయిలీ  లిపిలోనే చదువుకుంటున్నారు. ప్రస్తుతం బ్రెయిలీ లిపి అందులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కాగా ఈయన 1852 సంవత్సరంలో మరణించారు. 

 

 

 

జీవా  జననం : ప్రముఖ భారతీయ నటుడు జీవ తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఈయన జనవరి 4 1984 సంవత్సరంలో జన్మించారు. జీవా  అసలు పేరు అమర్  చౌదరి. జీవ 1996వ సంవత్సరం లోనే తన తండ్రి నిర్మించిన సినిమాల్లో బాల నటుడిగా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన జీవా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను  సంపాదించుకున్నారు. ప్రస్తుతం జీవా  తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం రంగం స్నేహితుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం జీవ తన 36వ యేట అడుగుపెట్టబోతున్నాడు.

 

 

 

 

 కెల్లీ డోర్జీ జననం   : తెలుగు ప్రేక్షకులకు కెల్లీడార్జి  బాగా సుపరిచితుడే. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి తన యాక్టింగ్ తో ఎంతగానో మెప్పించాడు ఈ నటుడు . స్టార్ హీరోల సినిమాల్లో సైతం విలన్   పాత్రలో నటించి మెప్పించాడు.

 

 

 ఆహుతి ప్రసాద్ మరణం : ఈయన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సుపరిచితులే. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందారు. 2015 జనవరి 4వ తేదీన మరణించారు. హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఆహుతిప్రసాద్ ఏకంగా మూడు వందల సినిమాలకు పైగా నటించారు.కేవలం హాస్య నటుడిగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  విభిన్నమైన పాత్రల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు ఆహుతి ప్రసాద్ . ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు  ఆహుతి ప్రసాద్. విభిన్నమైన సంభాషణా చాతుర్యంతో  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆహుతి ప్రసాద్.ఎన్నో  అవార్డులు రివార్డులు సైతం సొంతం చేసుకున్నారు. నిర్మాణ రంగంలో కూడా పనిచేశారు ఆహుతిప్రసాద్. 2015 జనవరి 4న క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతు మరణించాడు.

 

 

 సరోష్ హోమి కపాడియా మరణం  : భారత సుప్రీం కోర్టు 38 వ  ప్రధాన న్యాయమూర్తిగా సరోష్ హోమి కపాడియా  పని చేశారు. 1947 లో జన్మించిన ఈయన... 2016, జనవరి 4వ తేదీన మరణించారు.

 

 

 వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం : అందుల కోసం లూయి బ్రెయిలీ బ్రెయిలీ లిపి  కనుగొన్నాడు. అందువల్ల ఆయన  జన్మదినం సందర్భంగా జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: