జనవరి 16వ తేదీన చరిత్రలో ఎన్నో సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. నేడు చరిత్ర ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 

 ప్రజాభిప్రాయ సేకరణ : గోవా డామన్ డయ్యులు యూనియన్ టెరిటరీ గా ఉంటుంద  లేక మహారాష్ట్రలో కలిసిపోవడానికి సిద్ధమవుతుందా  అనేదానిపై 1967 జనవరి 16వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. యూనియన్ టెరిటరీ గానే కొనసాగిస్తామని ఇక్కడి ప్రాంత ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో తీర్మానం చేశారు. 

 

 

 గోవా రాష్ట్ర ప్రతిపత్తి  : 1987 సంవత్సరం వరకు యూనియన్ టెర్రిటరీ  గానే  కొనసాగిన గోవా .. ఆ తర్వాత 1987 మే 30వ తేదీన గోవాకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. ఆనాటి నుంచి గోవా ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతోంది. 

 

 

 గవర్నర్ నరసింహన్ : 2010 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా  నరసింహన్  నియమించబడ్డారు. 2010 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించబడ్డాడు ఆ తర్వాత... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత... రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి గవర్నర్ గా కూడా కొనసాగారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగుతూ... రెండు రాష్ట్రాల వ్యవహారాలను సమీక్షించారు. ఇక గత కొంత కాలం క్రితం గవర్నర్ నరసింహన్ పదవి నుంచి తప్పుకున్నాక  తెలంగాణ కొత్త గవర్నర్ గా తమిళ సై  సౌందర్య రాజన్... ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ నియమింపబడ్డారు. 

 

 

 పరుచూరి హనుమంతరావు జననం : 1921 జనవరి 16వ తేదీ కృష్ణా జిల్లాలో జన్మించారు. నిరు పేద రైతు కుటుంబంలో జన్మించారు పరుచూరి హనుమంతరావు. బొంబాయి పీపుల్స్ థియేటర్లు ఈయన బల్రాజ్ సహానితో  నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు పరుచూరి హనుమంతరావు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి కొందరు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు. సామాజిక కార్యకర్తగా  కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు పరుచూరి హనుమంతరావు. ప్రగతి ప్రింటర్స్ స్థాపించి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తమ ముద్రణాలయం గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు పరుచూరి హనుమంతరావు. ఆఫ్ సెట్  ముద్రణా యంత్రం... కంప్యూటర్ కంట్రోల్ తో సహా దేశంలోనే మొదటిసారిగా 1988 సంవత్సరంలో ఇక్కడి ప్రవేశించింది. 

 

 

 సూదిని జైపాల్ రెడ్డి జననం : కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 1942 జనవరి 16వ తేదీన జన్మించారు.ఎన్నో ఏళ్ళు  రాజకీయాలు కొనసాగిన ఈయన సేవ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని మాడుగుల లో జన్మించారు. ఈయన కేంద్ర మంత్రి గానే కాకుండా పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నోసార్లు విజయం సాధించి పార్లమెంటులో తనదైన  శైలిలో వాదనలు ప్రతి వాదనలు వినిపించారు. రెండు సార్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జైపాల్ రెడ్డి చట్టసభలలో చేసిన డిబేట్ లు అన్నీ అత్యంత కీలకమైనవి గానే ఉంటాయి. కీలకమైన అంశాల్లో చట్టసభల్లో ఆయన గొంత్తెత్తి  మాట్లాడారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్గా 1988లో ఎన్నుకోబడ్డారు. 

 

 

 సిద్ధార్థ మల్హోత్రా : ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా.. 1985 జనవరి 16వ తేదీన జన్మించారు. 18వ యేటే మోడల్ వృత్తి లోకి ప్రవేశించిన సిద్ధార్థ్ మల్హోత్ర ఆ తర్వాత 2010లో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ వద్దా... సహాయ దర్శకునిగా చేరి బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. 2012 సంవత్సరంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా రంగప్రవేశం చేశారు సిద్ధార్థ్ మల్హోత్రా. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని బాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగారు సిద్ధార్థ్ మల్హోత్రా. బాలీవుడ్ సినిమాల్లో తన సత్తా చాటుతూ మరోవైపు ఎన్నో రకాల బ్రాండ్ల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా కొనసాగారు సిద్ధార్థ మల్హోత్రా. 

 

 మహాదేవ గోవింద మరణం : ప్రముఖ జాతీయ ఉద్యమ నాయకుడు మహాదేవ గోవిందా 1901 జనవరి 16వ తేదీన మరణించారు.

 

 కోడి రామమూర్తి మరణం : కలియుగ భీముడు గా పిలుచుకునే ప్రముఖ మల్లయుద్ధ వీరుడు కోడి రామమూర్తి 1938 జనవరి 16వ తేదీన మరణించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: