ఫిబ్రవరి 28వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే.. ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు.. ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒక్కసారి ఈరోజు చరిత్రలో కి వెళ్లి చూసి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 భారత్ కి విముక్తి : 1948 ఫిబ్రవరి 28వ తేదీన ఆఖరి బ్రిటిష్ సేన భారతదేశాన్ని వదిలి వెళ్ళిన రోజు. 

 

 రాచమల్లు రామచంద్రారెడ్డి జననం : బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన రాచమల్లు రామచంద్రారెడ్డి 1922 ఫిబ్రవరి 28వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో అనువాదాలతో పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశారు. ఈయన రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా ప్రధానం చేసింది. 

 

 రాజేంద్రప్రసాద్ జననం : సినీ నటుడు రాజేంద్రప్రసాద్ తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. 1969 ఫిబ్రవరి 28వ తేదీన రాజేంద్రప్రసాద్ జన్మించారు.సినీ నటుడు గానే కాకుండా నిర్మాతగా సంగీత దర్శకుడిగా... హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నటుడు రాజేంద్రప్రసాద్. ఆహనా పెళ్ళంట లేడీస్ టైలర్ అప్పుల అప్పారావు ఏప్రిల్ 1న విడుదల మాయలోడు లాంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు  రాజేంద్ర ప్రసాద్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రాజేంద్రప్రసాద్. ఇక హాస్య నటుడిగా తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను కడుపుబ్బ నవ్వించారు. 

 

 

 సునీల్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సునీల్ 1973 ఫిబ్రవరి 28వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్. భీమవరానికి చెందిన సునీల్ తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు. మొదట హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సునిల్  తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా కూడా అవతారమెత్తాడు. హీరోగా పలు సినిమాల్లో నటించిన సునీల్ ఆ తర్వాత... తాను నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ గా నిలవడంతో మళ్లీ కమెడియన్ అవతారమెత్తి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు సునీల్. 

 

 

 శ్రీకాంత్ జననం : చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్ పలు విభిన్నమైన పాత్రలో నటించి... మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. శ్రీకాంత్. 1979 ఫిబ్రవరి 28వ తేదీన జన్మించారు. శ్రీకాంత్ పలు తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఎన్నో విభిన్నమైన సినిమాల్లో హీరోగా కూడా నటించారు శ్రీకాంత్. 

 

 

 బాబు రాజేంద్ర ప్రసాద్ మరణం : భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్రప్రసాద్ 1963 ఫిబ్రవరి 28వ తేదీన మరణించారు. భారత ప్రజలు అందరూ ఆయనని బాబు అని ప్రేమగా పిలుచుకుంటారు. అంతేకాకుండా స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్లకు ఎదురొడ్డి ఎన్నో  రోజుల పాటు పోరాటం కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: