మార్చి 13 వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు... ఎన్నో  ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 జోసెఫ్ ప్రీస్ట్ లి  జననం  : 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త రాజనీతిజ్ఞుడు అయినా జోసెఫ్ ప్రీస్ట్ లి ... వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్ ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నాడు . కార్బన్ డయాక్సైడ్ను కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే . కేవలం కార్బన్ డై ఆక్సైడ్ ఆక్సిజన్ మాత్రమే కాదు కార్బన్ మోనాక్సైడ్,  నైట్రోజన్ ఆక్సైడ్ ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఇవన్నీ వేర్వేరు సందర్భాలలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన జీవిత కాలంలో ఏకంగా అధ్యయనాలకు గాన 150 పుస్తకాలు రాశారు. మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం పై ఆసక్తిని పెంచుకున్నారు జోసెఫ్. ఈయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాల పై దాడి వల్ల 20ఏళ్ల పరిశోధన పత్రాలు ద్వాంసం  అయిపోయాయి. దీంతో అమెరికాకు వలస వెళ్లి అక్కడే వాయువుల పై పరిశోధన చేశాడు. ఈయన 1733 మార్చి 13 వ తేదీన జన్మించారు.

 

 కోలాచలం శ్రీనివాసరావు జననం : బళ్లారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత న్యాయవాది అయిన కోలాచలం శ్రీనివాసరావు 1854 13వ తేదీన జన్మించారు. ఎన్నో రచనలు రాశారు. ఆయన రాసిన రచనల్లో రామరాజు చరిత్ర మరో ప్రముఖ రచన. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ నాటక కళ అంటే అత్యంత అభిమానం. అప్పటికి నాటక రచయితలు కోలాచలం ధర్మవరం రామకృష్ణమాచార్యులు ప్రముఖులు. అంతేకాకుండా బళ్లారిలో సుమనోరమా  సభ అనే నాటక సమాజాన్ని కూడా స్థాపించారు.ఆయన వ్యవహారిక భాష ఉద్యమం ఎప్పుడు నాటకంలోని విషాదాంతం చేయడమే ఈయనకు ఇష్టం వుండేది కాదు. 

 

 బూర్గుల రామకృష్ణారావు జననం : బహుభాషావేత్త స్వాతంత్ర సమరయోధుడు రచయిత న్యాయవాది అయిన బూరుగుల రామకృష్ణ రావు 1899 మార్చి 13 వ తేదీన జన్మించారు. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి ఈయన. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల రామకృష్ణ రావు ప్రముఖుడు. పార్టీ తరపున అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించారు రామకృష్ణారావు. ఈయన హైదరాబాద్ ముఖ్యమంత్రిగానే కాకుండా మంత్రివర్గంలో కూడా పనిచేశారు. బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ,  మరాఠీ,  ఉర్దూ,  సంస్కృత భాషలో బూర్గుల కు ఎంతగానో ప్రావీణ్యం ఉంది.

 

 వరుణ్ గాంధీ జననం : భారతీయ జనతా పార్టీ యువనేత లో ప్రముఖుడైన వరుణ్ గాంధీ 1980 మార్చ్ 13 వ తేదీన జన్మించారు. భారతదేశంలో చారిత్రకంగా రాజకీయంగా ప్రముఖమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఈయన  తాను మూడు నెలల వయస్సు ఉన్నప్పుడే తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా ... నాలుగేళ్ల వయసులో నాన్నమ్మ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మరణించినది . ఇప్పటివరకు నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు ముగ్గురు భారత దేశ ప్రధాని పదవిని చేపట్టారు. అయితే వరుణ్ గాంధీ రాజకీయాలు చేరినప్పటి నుంచి భారతీయ జనతాపార్టీ పక్షంలోనే ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే పిలిభిత్ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కూడా పొందారు వరుణ్ గాంధీ. 

 

 కన్నెగంటి సూర్యనారాయణమూర్తి మరణం : తొలితరం స్వాతంత్ర్య సమర యోధుడు అయిన కన్నెగంటి సూర్యనారాయణమూర్తి 1990 మార్చి 13 వ తేదీన మరణించారు. ఈయన స్వాతంత్రోద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: