మార్చి 18వ తేదీన ఒకసారి చరిత్రలోకి వెళితే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 మహాత్మా గాంధీ అరెస్ట్ : జాతిపిత మహాత్మా గాంధీ 1922 మార్చి 18వ తేదీన శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకుగాను ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది. 

 

 ఐకే గుజ్రాల్ : 1998 మార్చి 18వ తేదీన భారత ప్రధాన మంత్రి పదవి విరమణ చేశారు. 

 

 గ్లోవర్   క్లీవ్ ల్యాండ్  జననం : అమెరికా మాజీ అధ్యక్షుడు అయిన గ్లోవర్  క్లీవ్లాండ్ 1837 మార్చి 18వ తేదీన జన్మించారు. 

 

 దండమూడి రామమోహనరావు జననం : ప్రముఖ మృదంగం వాయిద్యకారుడు అయిన దండమూడి రామమోహనరావు 1973 మార్చి 18వ తేదీన జన్మించారు. అయితే ఈయన ఆరో  ఏట  నుంచి మృదంగం వాయించి  ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్నారు. ఈయన  1944 నుండి ఆకాశవాణి కళాకారుడిగా కూడా గుర్తింపు పొందారు. 1949లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో మృదంగ విద్వాంసులు కచేరి చేరారు. ఆ తర్వాత  1933లో పదవి విరమణ చేశారు. 

 

 

 శశి కపూర్ జననం : ప్రముఖ భారతీయ నటుడు నిర్మాత అయిన శశి కపూర్ 1938 మార్చి 18వ తేదీన జన్మించారు. శశి కపూర్ నాలుగు సంవత్సరాలు ఉన్న వయసు నుండే తండ్రి పృథ్విరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వి థియేటర్స్ తో పాటు ప్రయాణిస్తూ సినిమాలు నిర్మించడం దర్శకత్వం వహించడం నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత తక్కువ వయసులోనే ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. అప్పట్లో శశికపూర్ పేరుతో పౌరాణిక చిత్రాల్లో నటించి మరో బాలనటుడు కూడా ఉండటం శశిరాజు  పేరుతో చిత్ర రంగానికి పరిచయమయ్యాడు శశి కపూర్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాలను నిర్మించారు కూడా. అనారోగ్యంతో బాధపడుతూ 2017 డిసెంబరు 4న మృతి చెందారు శశి కపూర్. 

 

 టి.దేవేందర్ గౌడ్ జననం : ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన టి.దేవేందర్ గౌడ్ 1953 మార్చి 18వ తేదీన జన్మించారు.ఈయన  రాజకీయాలలో ఎన్నో పదవులను అలంకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రి పదవులు చేపట్టిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇక విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఎక్కువ మొగ్గు చూపే వాడు దేవేందర్ గౌడ్. ఆ రోజుల్లో ఎన్టీరామారావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి  పార్టీలో ప్రముఖ నేతగా ఎదిగాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన దేవేందర్ గౌడ్ ఆంధ్ర రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. 

 

 

 సుశాంత్ జననం :  తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ  నటుడు సుశాంత్ తెలుగు ప్రేక్షకులకు తెలియని వారు  కాదు. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. సుశాంత్ 1986 మార్చి 18వ తేదీన జన్మించారు. అయితే తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. కాళిదాసు,  కరెంట్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ అక్కినేని హీరోల అంతగా క్రేజ్  సంపాదించలేక పోయారు. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురమూలో సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో సుశాంత్ నటన కు  ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. 

 

 చంద్రహాసన్  మరణం : రాజ్ కమల్  ఫిలింస్ ఇంటర్నేషనల్ అధినేత సినిమా నిర్మాత,  ప్రముఖ భారతీయ సినిమా నటులు  కమలహాసన్ చారుహాసన్ సోదరుడు అయిన చంద్ర హాసన్ 2015 మార్చి 18వ తేదీన మరణించారు. 

 

 బొమ్మ వెంకటేశ్వర్లు మరణం : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మాజీ శాసనసభ్యుడు భారత కాంగ్రెస్ తరపున 1999 నుండి 2004 వరకు హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నేత బొమ్మ వెంకటేశ్వర్లు 2019 మార్చి 18వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: