మార్చి 31వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే... ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒకసారి ఈరోజు చరిత్రపుటల్లో కి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 ఆనందీబాయి జోషి జననం : పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు అయిన ఆనందీబాయి జోషి 1865 మార్చి 31వ తేదీన జన్మించారు. పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన హిందూ మహిళ కూడా ఆనంది బాయి జోషి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇక అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఆనందీబాయి జోషి రికార్డు సృష్టించారు. మహారాష్ట్రలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆనందీబాయి జోషి బాల్య వివాహం చేసుకుంది. తన కంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు పెద్ద అయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆనంది బాయి జోషి... తన భర్త ప్రోత్సాహం వల్ల ఆంగ్లభాషను నేర్చుకోగలిగారు. 

 

 కపిలవాయి లింగమూర్తి జననం : పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత సాహితీ పరిశోధకుడు అయిన కపిలవాయి లింగమూర్తి 1928 మార్చి 31వ తేదీన జన్మించారు. పద్య రచనతో ప్రస్థానాన్ని ప్రారంభించిన కపిలవాయి లింగమూర్తి... కథారచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చి అందరికీ సుప్రసిద్ధులయ్యారు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లాలోని దేవాలయాలు పై విస్తృత పరిశోధనలు చేశారు కపిలవాయి లింగమూర్తి. ఇక ఆయన ఏకంగా 70కి పైగా పుస్తకాలను రచించారు. ఈయన రచనలు కూడా ఎంతగానో ప్రజాదరణ పొందాయి. ఆయన రచనలకు గానీ కవి కేసరి అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు కపిలవాయి లింగమూర్తి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ను అందుకున్న తొలి వ్యక్తిగా కూడా కపిలవాయి లింగమూర్తి రికార్డు సృష్టించారు.

 

 నటరాజ రామకృష్ణ చరణం: కూచిపూడి నాట్య కళాకారులు అయినా నటరాజ రామకృష్ణ 1933 మార్చి 31వ తేదీన జన్మించారు. ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో జన్మించిన నటరాజ రామకృష్ణ... ఆంధ్రనాట్యం,  పేరిణి శివతాండవం,  నవ జనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతులు అన్నిటిని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. 10వ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న పేరుని శివతాండవ నాట్యం పునరుద్ధరించారు నటరాజ రామకృష్ణ. ఈయన 2011 జూన్ ఏడో తేదీన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక నటరాజ రామకృష్ణ ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడి మరీ కల సాధన చేశారు. నాట్యం కోసం సంపదల్ని వదిలేసి జీవితాన్నే అంకితం చేశారు నటరాజ రామకృష్ణ. భారత ప్రభుత్వం ఇచ్చే గౌరవప్రదమైన డాక్టరేట్ ను కూడా అందుకున్నారు నటరాజ రామకృష్ణ

 

 కోనేరు హంపి జననం : భారతదేశపు చదరంగ క్రీడాకారిణి అయినా  కోనేరు హంపి 1987 మార్చి 31వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ లో జన్మించిన హంపి  ప్రపంచవ్యాప్తంగా  చెస్ ఆటలో  ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక భారతదేశం నుంచి ఫైడ్ ఎలో రేటింగ్ సాధించిన తొలి క్రీడాకారిణిగా కూడా కోనేరు హంపి నిలిచారు. అతి చిన్న వయసులోనే గ్రాండ్మాస్టర్ హోదాని పొంది కూడా రికార్డ్ సృష్టించారు కోనేరు హంపి. కేవలం 15 సంవత్సరాల 27 రోజుల వయసులోనే గ్రాండ్మాస్టర్ స్థానానికి ఎదిగారు. చదరంగం ఆటలో కోనేరు హంపి చూపించిన విశేష ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది. అంతేకాకుండా అర్జున అవార్డును కూడా కైవసం చేసుకున్నారు కోనేరు హంపి. 

 

 ఐజాక్ న్యూటన్ మరణం : ఆంగ్లేయ భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త అయిన సర్ ఐజాక్ న్యూటన్ ప్రపంచంలోనే అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడు గా కొనియాడబడిన వారు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సు గా ఎలా పరిణామం చెందింది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. ఈయన 1927 మార్చి 31వ తేదీన మరణించారు. 

 

 మీనా కుమారి మరణం : భారత చలనచిత్ర నటీమణి అయిన మీనాకుమారి ఎన్నో సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులు  అందరికీ దగ్గరయ్యారు. ఈమె  1972 మార్చి 31వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: