ఏప్రిల్ 1వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఏప్రిల్ ఒకటవ తేదిన ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 ఆంధ్ర పత్రిక : 1914 ఏప్రిల్ 1వ తేదీన వార పత్రిక నుంచి ఆంధ్ర పత్రిక దినపత్రిక గా మారింది. 

 

 భారతీయ రిజర్వు బ్యాంకు : 1935 సెప్టెంబర్ 1వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934 ప్రకారం ఈ బ్యాంకు స్థాపించబడింది. మొదట ఈ బ్యాంకు యొక్క హెడ్ ఆఫీస్ కొలకత్తా లో ఉండగా ప్రస్తుతం ముంబై నగరంలో ఉంది. 

 

 విలియం హార్వే జననం : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య శాస్త్రవేత్త గుండె పనిచేసే తీరును శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా ఏళ్ల క్రితమే వివరించి నేటి వైద్యులందరికీ మార్గదర్శకుడయ్యాడు విలియం హార్వే. ఈయన  1578 ఏప్రిల్ 1వ తేదీన జన్మించారు. హృదయం గురించి అందరికీ తెలిసేలా రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం ఎలా నడుస్తుందో చెప్పగలుగుతున్నారు అంటే.. అది కేవలం విలియం హార్వే పరిశోధన వల్లె.  గుండె గురించి తెలుసుకొనే సామర్థ్యం కేవలం దేవుడికి ఒక్కరికి మాత్రమే ఉంది అని విశ్వసిస్తున్న  రోజుల్లో ఇలాంటి నమ్మకాలను వ్యవస్థ నుంచి తొలగిస్తూ  శాస్త్రబద్ధంగా గుండె ప్రసరణ గురించి వివరించిన శాస్త్రవేత్త విలియం హార్వే కు దక్కుతుంది. 

 

 ఏటుకూరి వెంకట నరసయ్య జననం : క్షేత్ర లక్ష్మీ పద్యకావ్యం తో ఎంతగానో పేరుగాంచిన హేతువాది మానవతావాది కవి అయిన ఏటుకూరి వెంకట నరసయ్య 1911 ఏప్రిల్ 1వ తేదీన జన్మించారు. క్షేత్ర లక్ష్మి పద్యకావ్యం. పల్నాటి యుద్ధం నేపథ్యంగా పలనాటి వీరచరిత్రను ఐదు భాగాలు, నీతి మంజరి, రైతు హరికథ, సిద్ధాశ్రమం లాంటి ఎన్నో రచనలు నిర్వచించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చందమామ మాసపత్రిక ఆయన రాసిన నీతి కావ్యాలను ప్రచురించేది. 1949 నవంబర్ 10వ తేదీన మరణించారు. 

 

 

 అజిత్ వాడేకర్ జననం : భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ 1941 ఏప్రిల్ 1వ తేదీన ముంబైలో జన్మించారు. దేశవాళి క్రికెట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడు ముంబై తరఫున ఎన్నో  మ్యాచ్ లు ఆడారు. ఎడమచేతి బ్యాటింగ్ శైలి అజిత్ వాడేకర్.. భారత జట్టు తరఫున మొత్తం 37 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 2113 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ నాలుగు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అజిత్ వాడేకర్ సాధించిన అత్యధిక స్కోరు 143. ముంబై కెప్టెన్ గా ఉంటూనే 1971 లో భారత జట్టు కెప్టెన్ గా నియమించబడ్డాడు అజిత్ వాడేకర్. 2018 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున ముంబై లో చనిపోయాడు అజిత్ వాడేకర్. 

 

 వెంకట్ గోవాడ జననం  : తెలుగు నాటకరంగంలో యువ నాటక దర్శకుడు నటుడు నిర్మాత అయినా  వెంకట్ గోవాడ 1972 ఏప్రిల్ ఒకటవ తేదిన జన్మించారు. ఇంటర్మీడియట్ బోర్డు లో సూపరిండెంట్ గా పని చేస్తూనే రంగస్థలంపై నవరసాలు కనిపించేవారు వెంకట్ గోవాడ . థియేటర్ ఆర్ట్స్ లో  పీజీ డిప్లోమా కూడా చేశారు. 

 

 

 మధురాంతకం రాజారాం మరణం : ప్రముఖ కథకులు అయినా మధురాంతకం రాజారాం 1999 ఏప్రిల్ 1 వ తేదీన మరణించారు. సుమారు నాలుగు వందలకు పైగా కథలు ఐదు నవలలు నవలికలు నాటకాలు గేయాలు సాహితీ వ్యాసాలు రచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: