టైటానికి.. ఈ పేరు వినగానే మనకు ఆ లవ్ స్టోరీనే గుర్తొస్తుంది.. ఆ లవ్ స్టోరీ గురించే ఆలోచిస్తాం.. కానీ ఇది ఒక విషాదమైన కథ! అందులో ప్రేమ కేవలం కల్పితం మాత్రమే. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండులోని సౌతాంప్టన్‌ నుంచి న్యూయార్క్‌కు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మందితో టైటానిక్‌ ఓడ ప్రయాణం ప్రారంభమైంది. 

 

ఇంకా ఆ ఓడ నాలుగు రోజులు ప్రయాణించి ఏప్రిల్‌ 14 రాత్రి పడవ మునిగిపోయింది. అయితే ఆ పడవ మంచుకొండలను ఢీ కొట్టింది. దీంతో ఎంతోమంది మృతి చెందారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ ప్రమాదం నుండి బయటపడిన కొందరు దీని గురించి కథలు కధలుగా చెప్పారు. దీంతో 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ ఆ కథనే సినిమా రూపంలో చిత్రీకరించారు. 

 

అయితే ఆ సినిమాలో ఒక ప్రేమ కథ సృష్టించి కొన్ని పాత్రలను కలిపి ఓ అద్భుతమైన చిత్రంగా రూపొందించారు. ఇంకా ఈ అద్భుతమైన దృశ్యకావ్యానికి 11 ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు మిలియన్ డాలర్లు ఖర్చు అవ్వగా 2016, 2017 సంవత్సరానికి ఈ సినిమాకు అమెరికాలో 659.4 మిలియన్ డాలర్లు ఆదాయం వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: