ఏప్రిల్ 24వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు, ఎంతో  మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 పంచాయతీ వ్యవస్థ : 1993 ఏప్రిల్  24వ తేదీన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882లో రిఫన్ ప్రవేశపెట్టిన స్థానిక ప్రభుత్వం అనే ఆలోచన 84 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం వాస్తవంగా అమలులోకి వచ్చిన రోజు ఈరోజు.

 

 

 విస్సా అప్పారావు  జననం : మద్రాసు సంగీత అకాడమీ మూల స్తంభాలలో ఒకరైన విస్సా అప్పారావు 1884 24వ తేదీన జన్మించారుm గోదావరి జిల్లాలో జన్మించిన ఈయన ప్రముఖ భౌతిక శాస్త్ర చార్యులు. ఈయన రచించిన ఎన్నో రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా త్యాగరాజ కీర్తనలు,  క్షేత్రయ్య పదాలు, పరమాణు శక్తి, వ్యాసావళి ఆకాశం, విజ్ఞాన విశేషాలు లాంటి ఎన్నో రచనలు రచించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అప్పారావు. 

 

 నండూరి రామమోహన్  రావు జననం : తెలుగు పాత్రికేయులు అభ్యుదయవాది ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు అయిన నండూరి రామమోహనరావు 1927 24వ తేదీన జన్మించారు. కేవలం పాత్రికేయునిగా నే కాక రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు ఈయన.  చాలాకాలం పాటు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 1940వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురించబడ్డాయి. 

 

 రాజ్ కు మార్ జననం : రాజ్ కుమార్ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సింగనల్లూరు కొట్టు సోమయ్య ముత్తురాజు ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు. ఈయన 1929 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారు. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన అభిమానుల చేత డాక్టర్ రాజ్ అని పిలువబడే వారు. ఈయన కన్నడ చలనచిత్ర రంగంలో అర్ధశతాబ్దం పాటు రెండు వందల సినిమాల్లో నటించాడు. ఈయన నటించిన కొన్ని సినిమాలు మరుపురాని మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయి . ఆయన నటించిన చిత్రాలకే కాక నేపథ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్రదానం చేశారు రాజ్ కుమార్ . అనేక భక్తి గీతాలు కూడా పాడారు. ఇక తెలుగులో కూడా కాళహస్తి మహత్యం సినిమాలో భక్త కన్నప్ప అద్భుతంగా నటించారు రాజ్ కుమార్. చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సేవలకు గాను అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు రాజ్ కుమార్

 

 

 ఏడిద నాగేశ్వరరావు జన నం : ప్రముఖ తెలుగు సినీ నిర్మాత పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలున్న  తెలుగు సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులను సైతం గెలుచుకున్నారు ఏడిద నాగేశ్వరరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా  విజయవంతంగా కొనసాగారు. చిన్నప్పటి నుంచి సినిమా రంగంలో ఎంతో ఆసక్తి ఉన్న ఏడిద నాగేశ్వరరావు చిన్నప్పుడు నాటకాల్లో నటించారు. ఈయన నిర్మాతగానే కాకుండా నటనలో కూడా ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు. తొలుత నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. నటుడవ్వాలని  మద్రాసు వెళ్లిన ఏడిద నాగేశ్వరరావు నటుడిగా అవకాశాలు కాకపోవడంతో నిర్మాతగా మారిపోయారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మైలురాళ్లు లాంటి సినిమాలను నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు గారు. ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో గొప్ప నిర్మాత గా మిగిలిపోయారు. 

 

 

 సచిన్ టెండూల్కర్ జననం : భారత క్రికెట్ దేవుడిగా పిలుచుకునే  సచిన్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎంతో పేరెన్నికగన్న భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండూల్కర్. భారత దేశంలో క్రికెట్కు ఎక్కువమంది ప్రేక్షకాదరణ పొందేలా చేసిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. నవంబర్ 16 2013 తన  40 ఏట 200 టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు సచిన్ టెండూల్కర్. భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎన్నో విజయాలను అందించారు. భారత దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న పొందిన ఉత్తమ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. భారత క్రికెట్లో ఉర్రూతలూగించిన ఎన్నో మెరుపులు మెరిపించిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. 

 

 

 ఎమ్  వి  రాజమ్మ మరణం : దక్షిణభారతదేశపు నటి బహుముఖ ప్రజ్ఞాశాలి కన్నడ లోనే ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించినా నటి.  భారతదేశంలో మొదటి మహిళా నిర్మాత గా పేరుగాంచిన నటి పైన ఎంవి  రాజమ్మ 1999 ఏప్రిల్ 24వ తేదీన మరణించారు. భారతదేశంలోనే మొదటి మహిళా నిర్మాతగా పేరు గాంచారు ఈమె. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి అగ్రతారగా వెలుగొందాడు. కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ తో  కలిసి అనేక సినిమాలలో నటించారు ఎంవి  రాజమ్మ . 

 

 సత్య సాయి బాబా మరణం : భారతీయ ఆధ్యాత్మిక గురువు అయిన సత్యసాయిబాబా 2011 ఏప్రిల్ 24వ తేదీన మరణించారు. 1926 నవంబరు 23న పుట్టపర్తి లో జన్మించిన ఈయన 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన హిందూ మత గురువుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనను  ప్రజలందరూ భగవంతుని అవతారమని పలువురు విశ్వసించేవారు. ఈయన  మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉండేది. అయితే ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించారు వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను 5 నుండి 10 కోట్ల మధ్య ఉంది అంటూ  చెబుతుంటారు. అయితే పుట్టపర్తి సత్యసాయిబాబా సాక్షాత్తూ భగవంతుని అవతారమని... షిరిడి సాయి బాబా  మరల సత్య సాయిబాబాగా ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: