మే 12వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు,  ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు,  ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒకసారి చరిత్రపుటల్లో కి వెళ్లి ఈరోజు జన్మించిన ప్రముఖులు, జరిగిన  మరణాలు ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 జిడ్డు కృష్ణమూర్తి జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తత్వవేత్త అయిన జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె లో జన్మించాడు. ఈయన  తాత్విక ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. జిడ్డు కృష్ణమూర్తి  ముఖ్యాంశాలలో  మానసిక విప్లవం, మనోభావ విచారణ ధ్యానం మానవ సంబంధాలు సమాజం లో మౌలిక మార్పు లాంటివి ఉన్నాయి. తత్వవేత్త అయిన కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది  ఈస్ట్ అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి దానికి కృష్ణమూర్తిని ప్రధానిని చేసాడు . కొంతకాలం వరకు కృష్ణమూర్తి అందుకు అభ్యంతరం కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇతను కృష్ణమూర్తినా జగద్గురువునా  అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు కృష్ణమూర్తి. ఆ తర్వాత క్రమంలో జగద్గురువుగా ఎక్కడలేని గౌరవాలు అందుకున్నారు . ఆయన నడిచే దారిలో గులాబీ పువ్వులు కూడా పోసేవారు. 

 

 వింజమూరి అనసూయ జననం  : జానపద కళాకారులు, సంగీత దర్శకురాలు రచయిత అయినా వింజమూరి  అనసూయ 1920 మే 12వ తేదీన జన్మించారు. ఈమె హార్మోనియమ్ వాయించడంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇక వింజమూరి  అనసూయ సేవలకుగాను  కళాప్రపూర్ణ బిరుదును కూడా అంకితం చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచి వింజమూరి అనసూయ పాడటం మొదలు పెట్టారు . అందుకే వింజమూరి అనసూయ ను  బాలమేధావి అంటూ ఉంటారు. ఇక స్వతంత్రోద్యమంలో  మహామహులైన గాంధీజీ సుభాష్ చంద్రబోస్ జోహార్ లాల్ నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వింజమూరి  అనసూయ సొంతం. 

 

 

 భాట్టం  శ్రీరామమూర్తి జననం  : ప్రముఖ జర్నలిస్టు రాజకీయ వేత్త అయిన భాట్టం  శ్రీరామమూర్తి 1926 మే 12వ తేదీన జన్మించారు. ఈయన  సోషలిస్టు  పార్టీలో చేరి ఎంతో చురుకుగా ముఖ్య నేతగా ఎదిగారు. ఆ తర్వాత సోషలిస్టు పార్టీలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ జాయింట్ సెక్రటరీగా కూడా కొనసాగారు. ఇక ఆ తర్వాత భారత సోషలిస్టు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన  శ్రీరామమూర్తి... ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లో సుమారు 16 సంవత్సరాలపాటు సభ్యుడిగా కొనసాగారు. శాసనసభ్యుడిగా ఎన్నో ఏళ్ల పాటు తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు. 

 

 

  మాస్టర్ సివివి  మరణం : మాస్టర్ సి.వి.వి గా బాహుళ్యానికి తెలిసిన  మాస్టర్ కంచు పార్టీ వెంకటరావు వెంకటస్వామి రావు. ఈయన  1922 మే 12వ తేదీన మరణించారు. భారతీయ తత్వవేత్త యోగి గురువు అయిన ఈయన.. కొంతకాలం కుంభకోణం మున్సిపల్ కౌన్సిల్ కు చైర్మన్గా కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాత కాలంలో ఆధ్యాత్మిక సంస్కర్తగా మారి  మానవ ప్రగతి ఆధ్యాత్మిక పరిణామాలపై దృక్పథాన్ని పరిచయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: