మే 14వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి  నేడు జన్మించిన ప్రముఖులు.. సంభవించిన మరణాలు జరిగిన సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 హాలహర్వి సీతారామరెడ్డి జననం : రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులు అయిన హాలహర్వి సీతారామిరెడ్డి 1900 సంవత్సరం మే 14వ తేదీన బళ్ళారి లో జన్మించారు. బళ్లారి నుంచి మద్రాసు శాసనసభకు ఎన్నికై 1945 నుంచి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ పరిశ్రమల  శాఖల మంత్రిగా పనిచేశారు సీతారామరెడ్డి. 1933లో 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. రాయలసీమ అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా కూడా హాలహర్వి సీతారామిరెడ్డి ఎన్నికయ్యారు. ఆంధ్ర ఉద్యమంలో చురుకుగా పని చేసిన సీతారాంరెడ్డి 1937లో కడప కోటిరెడ్డి అధ్యక్షతన విజయవాడలో జరిగిన రజతోత్సవ ఆంధ్ర మహాసభలను ప్రారంభించారు. 

 

 వహీదా రెహమాన్ జననం : సుప్రసిద్ధ హిందీ నటీమణి అయిన వహీదా రెహమాన్ 1936 మే 14వ తేదీన జన్మించారు. హైదరాబాద్లోని సాంప్రదాయక ముస్లిం కుటుంబంలో జన్మించిన వాజీదా రెహమాన్... సినిమాలలో ఎంతగానో గుర్తింపు సంపాదించారు. గురుదత్ వహీదా రెహమాన్ కు  ప్రోత్సాహాన్ని అందించారు. అయితే ఈయన తో కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. కొన్ని సినిమాల్లో అయితే చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అయితే వహిదా రెహమాన్  వాజీదా ఎంతో  చనువుగా ఉండటం కారణంగా వీరి మధ్య ఏదో సంబంధం ఉంది అని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు.. జాతీయ అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు వహిదా రెహ్మాన్. 

 

 రాబర్ట్ జార్విక్ జననం : కృత్రిమ గుండెను కనుగొనడానికి ఎంతగానో కృషిచేసిన రాబర్ట్  జార్విక్ 1946 మే 14వ తేదీన జన్మించారు. జార్విక్ 7 అనే కృత్రిమ గుండెను కనిపెట్టారు. 

 

 నూతి విశ్వామిత్ర జననం : నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు ఆయన నూతి విశ్వామిత్ర 1926 మే 14వ తేదీన జన్మించారు. నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నూతి విశ్వామిత్ర ఎంతో మంది ప్రజల్లో  ఉద్యమ కాంక్ష  ను రగిల్చి  ముందుకు నడిచేలా చేసారు. ఎన్నో  ప్రసంగాలతో అప్పటికి నిరంకుశ పాలనను ప్రజలు అందరికీ తెలియ జేస్తూ అందరూ ఉద్యమం వైపు అడుగులు వేసేలా ఎన్నో ప్రయత్నాలు చేశారు నూతి విశ్వామిత్ర. 

 

 చందాల కేశవదాసు మరణం : తొలి తెలుగు నాటక కవిత తొలి సినీ గీత రచయిత కవి నటుడు గాయకుడు హరికథా కళాకారుడు అయిన చందాల కేశవదాసు 1956 మే 14వ తేదీన పరమపదించారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మైలురాళ్లలాంటి పాట లకు ఎంతగానో  గుర్తింపు సంపాదించారు. తెలుగులో మొదటి శతాబ్దకవిగా భక్త ప్రహ్లాద పాటలు రాశారు. అష్టావధానాలు చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు వారితో స్నేహం కుదిరింది. తర్వాత  ప్రాంతీయ సంగీతంలోని మెళుకువలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: