మే 16వ తేదీన ఒకసారి చరిత్రలో  కి వెళ్లి చూస్తే ఎన్నో  ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు, ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి . మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటన ఏంటో  తెలుసుకుందాం రండి 

 

 అటల్ బీహార్ వాజ్పేయి : భారత ప్రధానమంత్రిగా 1996 మే 16వ తేదీన అటల్ బీహార్ వాజ్పేయి నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అయ్యారు అటల్ బిహారీ వాజ్పేయి. 

 

 సుద్దాల అశోక్ తేజ జననం : తెలుగు సినిమా కథ పాటల రచయిత.. సుమారు 1200 పైగా చిత్రాల్లో 2250 చిలక పాటలు రాసిన గొప్ప రచయిత ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ 1960 మే 16వ తేదీన జన్మించారు. ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఠాగూర్ సినిమాలో నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయితగా కూడా పురస్కారం పొందాడు సుద్దాల అశోక్ తేజ. బాల్యం నుంచి పాటలు రాయడం నేర్చుకున్న అశోక్ తేజ... పాటలు రాయడంలో  ఎంతో నైపుణ్యం సాధించారు. ఇక సినీ పరిశ్రమకు రాకముందు నుంచే అశోక్ తేజ  మెట్పల్లిలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉండేవారు. నమస్తే అన్నా చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు గేయ రచయితగా పరిచయమయ్యారు సుద్దాల అశోక్ తేజ. ఇక నటుడు ఉత్తేజ్ కి ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ మేనమామ కావడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం ఆయనకు అంత కష్టం కాలేదు. అంతేకాకుండా తనికెళ్ల భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినీ రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించారు సుద్దాల అశోక్ తేజ. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చేలా చేసింది మాత్రం దాసరి నారాయణ రావు. అంతేకాకుండా కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి పాటలు రాసి ఎంతో గుర్తింపు సంపాదించారు. తొలుత కేవలం విప్లవ గీతాలు మాత్రమే రాసిన  సుద్దాల అశోక్ తేజ... కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో ఇతర పాటలు కూడా రాయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఒసేయ్ రాములమ్మ నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో ఎంతో గుర్తింపు సంపాదించారు సుద్దాల అశోక్ తేజ.

 

 డాక్టర్ లింగం సూర్యనారాయణ జననం : ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు అయిన డాక్టర్ లింగం సూర్యనారాయణ 1923 మే 16వ తేదీన జన్మించారు. ఈయన  శస్త్రచికిత్సలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

 

 సోమా  బిస్వాస్  జననం : భారత అథ్లెటిక్ క్రీడాకారిణి అయినా సోమా  బిస్వాస్  1978 మే 16వ తేదీన జన్మించారు. 

 

 దుర్గ నాగేశ్వర రావు మరణం  : తెలుగు చలన చిత్ర దర్శకుడు... దర్శకరత్న దాసరి నారాయణరావు వద్దా ఎక్సిగ్యుటివ్  డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి  దుర్గా నాగేశ్వర రావు 2018 మే 16వ తేదీన మరణించారు. 1978లో తొలిసారిగా విజయ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: