మే 27వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 


 దీపాల పిచ్చయ్య శాస్త్రి జననం : సుప్రసిద్ధ పండితులు అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి 1894 మే 27వ తేదీన జన్మించారు. గుంటూరు జిల్లాలో జన్మించిన ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం వార్షిక  పరీక్షల్లో ఉత్తీర్ణులై.,. వెంకటగిరి మహారాజా కళాశాలలో 19 సంవత్సరాలుగా తెలుగు పండితులుగా పనిచేశారు. ఇక ఈయన రచించిన ఎన్నో రచనలు ప్రేక్షకాదరణ పొందాయి. కేవలం రచనల మాత్రమే కాకుండా అనువాదాలు కూడా చేశారు. 

 


 రవిశాస్త్రి జననం : ప్రముఖ భారతీయ మాజీ  క్రికెటర్ మరియు ప్రస్తుత క్రికెట్ జట్టు కోచ్ అయినా రవిశాస్త్రి 1962 మే 27వ తేదీన ముంబైలో జన్మించారు . కుడి చేతి వాటం బ్యాట్స్మన్ ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ వేయగల ఆల్ రౌండర్ రవి శాస్త్రి. భారత జట్టు తరఫున ఎన్నో సంవత్సరాల పాటు తన ఆటతో సేవలందించారు. ఆల్ రౌండర్ గా  ఏకంగా 18 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన 12 సంవత్సరాల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు రవిశాస్త్రి . కెరీర్ ప్రారంభంలో కేవలం బౌలర్ గానే క్రీడాజీవితం ప్రారంభించినా రావిశాస్త్రి ఆ తర్వాత బ్యాట్స్మన్గా క్రమ క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్  క్రికెట్ లో తన క్రీడా జీవితంలోనే అత్యంత ప్రతిభను కనబరిచారు...  చాంపియన్ గా  ఎన్నికయ్యారు. అదే సీజన్ లో  ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి... ఇలా ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు రావిశాస్త్రి. ఇక దేశవాళీ క్రికెట్లో కూడా ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించాడు రావిశాస్త్రి. ఇక ప్రస్తుతం టీమిండియా జట్టు ప్రధాన కోచ్గా కొనసాగుతున్నారు రవిశాస్త్రి. రవిశాస్త్రి కోచింగ్ లో టీమిండియా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. 


 అంకిత జనం : రస్నా  బేబీ గా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు పొందిన సినీ కథానాయిక అంకిత. ఈమె  1982 మే 27వ జన్మించారు. చిన్నతనంలో రస్నా లాంటి  ఉత్పత్తులు ప్రకటనలలో నటించిన అంకిత ఎంతగానో గుర్తింపు సంపాదించాడు. ఇక కథానాయికగా  ఈమె మొదటి చిత్రం వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తర్వాత సింహాద్రి వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కూడా నటించింది. ఇక ఆ తర్వాత కొత్త కథానాయకల  నుంచి పోటీ పెరగడంతో.... చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది అంకితం.

 

 కందుకూరి వీరేశలింగం మరణం : భారతీయ గొప్ప సంఘ సంస్కర్త తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి సాహితీ వ్యాసంగం లోని కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కందుకూరి వీరేశలింగం పంతులు 1919 మే 27వ తేదీన మరణించారు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు. స్త్రీ విద్య కోసం ఉద్యమించి ప్రచారం చెయ్యడమే కాదు బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. అంతేకాకుండా మగ పిల్లలతో కలిసి ఆడ పిల్లలు చదువుకునే సంస్కృతికి నాంది పలికాడు కందుకూరి వీరేశలింగం.

 

 

 జవహర్ లాల్ నెహ్రూ మరణం  : భారతదేశ మొట్టమొదటి ప్రధాని భారత స్వతంత్ర పోరాట నాయకుడు పండిత్  జవహర్ లాల్ నెహ్రూ 1964 మే 27వ తేదీన మరణించారు. పండితుడు చరిత్రకారుడు అయిన జవహర్  లాల్ నెహ్రూ భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు మిగిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: