జూన్ 3వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి . మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 


 కరుణానిధి జననం : ప్రముఖ భారత దేశ రాజకీయవేత్త ... తమిళనాడు మాజీ  ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1924 జూన్ 3వ తేదీన జన్మించారు. 1969లో అన్నాదురై  మరణించినప్పుడు నుంచి నేటి వరకు తమిళనాడులోని రాజకీయ పార్టీ అయినా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగారు కరుణానిధి.. కరుణానిధి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రానికి పనిచేశారు. తన 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచి సంచలన రికార్డు సృష్టించారు కరుణానిధి. 2004 లోక్సభ ఎన్నికలలో తమిళనాడు లోని అన్ని లోక్సభ స్థానాల్లో యూపీయే గెలుపు లో  ప్రధాన పాత్ర పోషించాడు కరుణానిధి. 

 


 చిమన్ భాయ్ పటేల్ జననం  : గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి అయిన చిమన్ భాయి పటేల్ 1929 జూన్ 3వ తేదీన జన్మించారు. ఈయన గుజరాత్ రాజకీయాలలో ఎంతో గొప్ప రాజకీయవేత్తగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. కేవలం ముఖ్యమంత్రిగానే కాకుండా పలుమార్లు కీలక పదవులను కూడా అధిరోహించారు చిమన్ భాయ్ పటేల్.

 

 సురేందర్ కన్నా జననం  : ప్రముఖ భారతీయ మాజీ క్రికెట్ కారుడైన సురేందర్ కన్నా 1965 జూన్ 3వ తేదీన ఢిల్లీలో జన్మించారు. ఈయన భారత క్రికెట్ జట్టు తరఫున 1979 నుంచి 1984 వరకు పది వన్డేలకు ప్రాతినిథ్యం కూడా వహించారు. ఒక దేశవాళీ క్రికెట్ పోటీలలో కూడా ఢిల్లీ తరఫున పాల్గొన్నారు సురేందర్ కన్న. వికెట్ కీపర్గా జట్టులో కీలక ఆటగాడిగా ఎన్నో  ఏళ్లపాటు జట్టుకు సేవలు అందించారు.

 

 రాధా జననం : ప్రముఖ భారతీయ సినీ నటి అయిన రాధ సినిమా ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు . ఈమె  1966 జూన్ 3వ తేదీన జన్మించారు. ముఖ్యంగా తమిళ చలనచిత్ర రంగంలో 80వ దశకంలో ఎంతగానో  గుర్తింపు  సంపాదించారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు మలయాళ కన్నడ భాషల్లో కూడా దశాబ్దకాలంపాటు స్టార్ హీరోయిన్ కొనసాగారు రాధ. ముఖ్యంగా దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాల్లో నటించి... ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇక 1980 దశకంలో అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఇక రాదా నటజీవితం తారా స్థాయిలో ఉన్న సమయంలోనే తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు రాధా.

 

 తన్నీరు హరీష్ రావు జననం : తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు అయిన తన్నీరు హరీష్ రావు 1972 జూన్ 3వ తేదీన జన్మించారు. ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా దూసుకుపోతున్నారు. సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా శాసనసభ్యులుగా ఎన్నికవుతూ వస్తున్నారు తన్నీరు హరీష్ రావు. ఈయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మేనల్లుడు. హరీష్ 2004 లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వైయస్ రాజశేఖర్రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు హరీష్ రావు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరిన హరీష్ ఆ పార్టీలో కీలక నేతగా మారిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్ధిపేట  నియోజకవర్గం నుంచి ఎన్నికైన హరీష్ రావు కేసీఆర్ క్యాబినెట్ లో నీటి పారుదల  శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఇక రెండవ సారి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గా పనిచేస్తున్నారు తన్నీరు హరీష్ రావు.

 


 సంగం లక్ష్మీబాయి మరణం : 
 ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు భారత లోక్ సభ సభ్యురాలు అయిన సంగం లక్ష్మీబాయి 1979 జూన్ 3వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైన తొలి మహిళ సంగం లక్ష్మీబాయి కావడం గమనార్హం. ఈమె సంఘ సేవ లోనే ఎంతగానో సమయం వెచ్చించి ఆ తరువాత రాజకీయాల వైపు నడిచారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలపై ఎంతో ఆసక్తి కలిగిన సంగం లక్ష్మీబాయి ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: