జూన్ 2వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూసి ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి. 

 

 భారతీయ స్టేట్ బ్యాంక్ : 1806 జూన్ 2వ తేదీన భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదట కొలకత్తా లో స్థాపించబడింది. భారత ఉపఖండం లోనే అత్యంత పురాతనమైన బ్యాంకులలో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 

 

 తెలంగాణ రాష్ట్ర అవతరణ : 2014 జూన్ 2వ తేదీన భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మొత్తం పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగింది.

 

 ఇళయరాజా జననం : భారతదేశపు ప్రముఖ సంగీత దర్శకుడు పాటల రచయిత గాయకుడుగా  ఎంతో గుర్తింపు సంపాదించిన వ్యక్తి ఇళయరాజా. 1943 జూన్ 2వ తేదీన జన్మించారు ఈయన . అయినా దాదాపు మూడు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో ఆయన సేవలను అందించారు. ఇక వివిధ భాషల్లో ఇళయరాజా అందించిన పాటలు ఇప్పటికే మైలురాళ్ళులా నిలిచాయి . ఇప్పటికే వివిధ భాషలలో ఏకంగా  ఐదువేల పాటలను అందించిన ఈయన 1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. దక్షిణ సినీ చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప సంగీత దర్శకులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇళయరాజా పాటలు అంటే ఇప్పటికీ నేటితరం ప్రేక్షకుల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు ,.ఆయన పాటల్లో మధురానుభూతి... ఎంత గానో  ఉంటుంది. పాత్ర వింటున్నంత సేపు మనసుకు హాయిని కలిగిస్తాయి ఉంటాయి. చెన్నైలో శుభకార్యాలకు సభలకు సంగీత ప్రదర్శనలు ఇచ్చే బృందంలో సభ్యుడిగా ఇళయరాజా సంగీత జీవితాన్ని ప్రారంభించారు... ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించి సహాయ  సంగీత దర్శకుడిగా ఆ తర్వాత సంగీత దర్శకుడిగా చేరి తన లోని సంగీత ప్రతిభను నిరూపించుకున్నారు ఇళయ రాజా. 

 

 మణిరత్నం జననం : దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు అయిన మణిరత్నం దక్షిణాది సినీ ప్రేక్షకులందరికి సుపతిచితుడే. ఈయన 1955 జూన్ 2వ తేదీన జన్మించారు. దర్శకత్వంలో తనదైన  మెలుకువలతో  ఎన్నో సినిమాలను తెరకెక్కించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు మణిరత్నం. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి  ఎన్నో ఏళ్ల పాటు విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగించిన ఆనాటి  హీరోయిన్ సుహాసిని సంగీత దర్శకుడు మణిరత్నం భార్య. ఈయన  తెలుగు లో కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించి సంచలన విజయాలను అందుకున్నారు. ఈయన తెలుగులో ప దర్శకత్వం వహించిన సినిమా గీతాంజలి. ఇక తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు తెలుగులోకి కూడా అనువదించబడ్డాయి . రోజా బొంబాయి గీతాంజలి లాంటి సినిమాలు కెరీర్ లో మైలురాళ్లను నిలిచాయి . అప్పట్లో ఆయన దర్శకత్వ ప్రతిభను చూసి ఎంతగానో ఆశ్చర్య పోయేవారు అందరూ. 

 

 హేమచంద్ర జననం : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నేపథ్య గాయకుడు అయిన హేమచంద్ర తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కొసమెరుపు . హేమచంద్ర 1988 జూన్ 2వ తేదీన జన్మించారు. 2005లో జరిగిన సరిగమప పాటల పోటీలో రన్నరప్ గా  నిలిచాడు హేమచంద్ర. హేమచంద్ర గాయకునిగా ఎంతో గుర్తింపు సంపాదించారు. కేవలం గాయకుడు గానే కాకుండా డబ్బింగ్ కళాకారుడు కూడా హేమచంద్ర కు మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత 2012 డిసెంబర్ 9వ తేదీన తన సహ గాయకురాలు అయిన శ్రావణ భార్గవి ని పెళ్లి చేసుకున్నారు. తన సినీ కెరీర్ లో మొదటి పాట మణిశర్మ సంగీత దర్శకత్వంలో లక్ష్యం సినిమా కోసం నిలువదే అనే పాటను పాడారు హేమచంద్ర. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో  పాడేందుకు అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సింగర్ గా కొనసాగుతున్నాడు హేమచంద్ర

 

 గుణశేఖర్ జననం : దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించే ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఎన్నో ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న దర్శకుడిగా కొనసాగుతున్నారు  గుణశేఖర్. స్టార్  హీరోలతో  సినిమాలను తెరకెక్కించి ఎన్నో  విజయాలను అందుకున్నాడు గుణశేఖర్. 1964 జూన్ 2వ తేదీన జన్మించారు. 

 

 సుజనా చౌదరి జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు అయిన సుజనా చౌదరి... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉంటారు.ఈయన  1961 జూన్ 2వ తేదీన జన్మించారు. 

 


 రాజ్ కపూర్ మరణం : భారత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అయిన రాజ్ కపూర్  1988 జూన్ 2వ తేదీన మరణించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాజ్ కపూర్ కి ఎంతగానో గుర్తింపు ఉంది. ఎన్నో  సినిమాల్లో తనదైన నటనతో అభిమానులను  సంపాదించుకున్నారు  రాజ్ కపూర్  దర్శకుడిగా నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని  విజయవంతంగా కొనసాగించారు

మరింత సమాచారం తెలుసుకోండి: