జూన్ 13వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు,  ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి.  మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి  నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి

 


 కిరికెర రెడ్డి భీమారావు జననం : సుప్రసిద్ధ తెలుగు కన్నడ కవి అయినా కిరికెర రెడ్డి భీమారావు 1896 జూన్ 13వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు కన్నడ భాషలలో కవితలు రాయడంలో  సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కవిత్వం కూడా ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది. ఈయన తెలుగు భాషలు ఎన్నో రచనలు రచించగా ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి . అటు కన్నడ భాషలో కూడా ఎన్నో గ్రంథాలను రచించారు ఈయన. కన్నడ తెలుగు భాషలో కవిత్వవ్యమళ్ళిన వ్యక్తిగా  ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.ఈయన  రచించిన రచనలకు గాను  ఎన్నో బిరుదులు అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు ఈయన . 

 

 మార్పు బాలకృష్ణమ్మ జననం : ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు అయిన మార్పు బాలకృష్ణమ్మ 1935 జూన్ 13వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా కూడా పనిచేశారు. ఈయన  విద్యార్థి దశ నుంచే ప్రగతి భావాలను కలిగి ఉండేవారు. ఈయన ఉపాధ్యాయ శిక్షణ అనంతరం ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ గా చేరి ఉపాధ్యాయ ఉద్యమంలో చేరారు. ఆ తర్వాత కాలంలో ఆయన ఉద్యమ పితామహుడుగా కూడా ఆవిష్కరించారు. ఉపాధ్యాయిల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారు మార్పు బాలకృష్ణమ్మ. 2013 జనవరి 6వ తేదీన ఆయన పరమపదించారు. 

 

 మణిందర్ సింగ్ జననం : భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయినా మణిందర్ సింగ్ 1965 జూన్ 13వ తేదీన జన్మించారు. భారత జట్టు తరఫున మహేందర్ సింగ్ 35 టెస్ట్  మ్యాచ్లు 59 వన్డేలు ప్రాతినిధ్యం వహించాడు. పోలింగ్ లో ఎంతో చక్కటి నైపుణ్యం ప్రదర్శించిన మనిందర్  సింగ్  బిషన్ సింగ్ బేడీ వారసుడిగా క్రికెట్లో పరిగణించబడ్డారు. 1987లో ప్రపంచ కప్ లో పాల్గొన్న భారత జట్టులో ఇతను కూడా ఒక సభ్యులు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మనిందర్ సింగ్ . ఈయన 1982లో డిసెంబర్లో కరాచీలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో తన కెరీర్ను ప్రారంభించాడు. 1993లో అతని చివరి మ్యాచ్ ఆడాడు. అంతర్ జాతీయ జట్టులో రాజకీయాల కారణంగా అంతర్జాతీయ జట్టుకు దూరమయ్యాడు మనిందర్ సింగ్. 

 


 కప్పగళ్ళు సంజీవ మూర్తి మరణం : ఉపాధ్యాయుడు రచయిత అయిన కప్పగల్లు  సంజీవ మూర్తి 1962 జూన్ 13వ తేదీన మరణించారు. ఈయన ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు ఎన్నో రచనలు కూడా రచించారుm ఈయన రచించిన రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. ఈయన రచించిన రచనలకు గాను  కవివిభూన  అనే బిరుదును కూడా పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: