జూన్ 17వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి . మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 తిరుమల రామచంద్ర జననం : సంపాదకుడు రచయిత స్వాతంత్ర సమరయోధుడు అయిన తిరుమల రామచంద్ర 1913 జూన్ 15వ తేదీన జన్మించారు. అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా లో జన్మించారు ఈయన. తిరుమల రామచంద్ర మూర్తి బహుభాషావేత్త. మాతృభాష తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ పాకృతాది భాషలో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త తిరుమల రామచంద్ర. తన జీవితంలో రకరకాల వృత్తులు చేసి వివిధ అనుభవాలను సంపాదించారు. విస్తృత లోకపు  అంశాలపైన రామచంద్ర తనను తాను భిన్నంగా భాషా సేవకుడిని  అని అభివర్ణించబడే వారు.  ఈయన  సంపాదకుడిగా రచయితగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలకపాత్ర వహించారు తిరుమల రామచంద్ర, 

 


 సింధు మీనన్ జననం : భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి సింధుమీనన్ 1985 జూన్ 17వ తేదీన జన్మించారు. ముఖ్యంగా తెలుగు కన్నడ మలయాళ ప్రేక్షకులందరికీ సింధుమీనన్ సుపరిచితురాలు . చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనా ప్రస్థానం 1994లో కన్నడ సినిమా రష్మి అనే సినిమా ద్వారా ప్రారంభించింది. బెంగళూరులో జన్మించిన సింధుమీనన్... భరత నాట్యంలో  ఎంతగానో ప్రావీణ్యత సాధించింది. 1999లో వచ్చిన ప్రేమ ప్రేమ ప్రేమ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. హీరోయిన్ నటించినప్పుడు 13 సంవత్సరాల వయస్సు ఉంది సింధు  మీనన్. పలు టీవీ కార్యక్రమాలకు  కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది సింధు మీనన్. 

 


 ఝాన్సీ లక్ష్మీబాయి మరణం : ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు అయిన ఝాన్సీ లక్ష్మీబాయి 1858 జూన్ 17 వ తేదీన మరణించాడు. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. అయితే స్వతంత్ర పోరాటంలో మహిళ సాధికారత చాటి ఆంగ్లేయులకు ఎదురొడ్డి నిలబడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి ఇప్పటికి కూడా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: