21వ తేదీన ఒకసారి చరిత్రలోకి వెళ్లి  చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు తెలుసుకుందాం రండి. 


 భారతీయ స్టేట్ బ్యాంకు : భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1806 జూన్ 2వ తేదీన కలకత్తాలో స్థాపించబడింది, ఈ బ్యాంకు భారత ఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకుల్లో  ఒకటి. బ్యాంకు దేశీయ అంతర్జాతీయ ప్రవాస భారతీయ బ్యాంక్ సేవలను అందిస్తోంది. 1955 జులై 1వ తేదీన ఈ బ్యాంకును భారత ప్రభుత్వం జాతీయం  చేసి ఆధీనంలోకి తీసుకుంది. 

 

 ఇంటూరి వెంకటేశ్వరరావు జననం : స్వాతంత్ర సమరయోధులు తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు అయిన ఇంటూరి వెంకటేశ్వరరావు 1909 జులై 1వ తేదీన జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం అనతరం  స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని మూడు సంవత్సరాలకు పైగా కారాగారశిక్ష అనుభవించాడు ఇంటూరి వెంకటేశ్వరరావు. ఇక ఈయన సహాయ దర్శకునిగా సుమతి మాయాలోకం పేదరైతు లక్ష్మి సక్కుబాయి నాగపంచమి లాంటి ఎన్నో సినిమాలకు పనిచేశారు, ఈయన  చాలాకాలంపాటు నవజీవన్ సినిమా పత్రిక సంపాదకులుగా కూడా కొనసాగారు. 

 

 వెంకయ్య నాయుడు జననం : భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన వెంకయ్యనాయుడు 1949 జూలై 1వ తేదీన జన్మించారు. ఆగస్టు 11 2017 వ తేదీన భారతదేశపు ఉప  రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకరం చేశారు. తెలుగు రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడు మొదటి నుంచి బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు, విద్యార్థి నాయకుడిగా విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు నడిచారు  వెంకయ్య నాయుడు, అదేసమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 


ఎస్ ఎం  భాష జననం  : ప్రముఖ రంగస్థల నటుడు రచయిత దర్శకుడు  ఎస్ ఎమ్ భాష 1963 జులై 1వ తేదీన జన్మించారు.  నాటక రంగంలో ఎన్నో నాటకాల్లో నటించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అంతే కాకుండా ఎన్నో నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి  మంచి గుర్తింపును సంపాదించారు, ఉత్తమ దర్శకుడిగా ఉత్తమ సహాయ నటుడిగా కూడా ఎన్నో అవార్డులను అందుకున్నారు, 


 సీతారా జననం : ప్రముఖ భారతీయ నేపథ్య గాయని అయిన సితార 1986 జూలై 1 వ తేదీన జన్మించారు, ఈయన  పూర్తి పేరు సీతా రామ కృష్ణ కుమార్. తన కెరీర్లో అతి ఎక్కువ పాటలు  మలయాళంలో పాడగా..  తమిళ తెలుగు కన్నడ సినిమాల్లో కూడా పాడి ఎంతగానో ఎంత సంపాదించారు. 

 

 దేవరకొండ బాల గంగాధర తిలక్ మరణం : ఆధునిక తెలుగు కవి అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ 1966 జూలై 1వ తేదీన మరణించారు, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈయన  కవితలు యువతలో ఎంతగానో ఉత్తేజాన్ని నింపుతూ ఉంటాయి, కవిగా కథకుడిగా నాటకకర్తగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు దేవరకొండ బాల గంగాధర తిలక్. ఇక ఈయన రాసిన కవితలు రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి అని చెప్పాలి, 


 తాతినేని ప్రకాశరావు మరణం : సుప్రసిద్ధ తెలుగు తమిళ హిందీ సినిమా దర్శకుడు అయిన తాతినేని ప్రసాద్ 1992 జూలై 1వ తేదీన మరణించారు. ఈయన  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన షావుకారు పాతాళభైరవి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశారు, ఇక జయం మనదేరా మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు తాతినేని ప్రకాశరావు శివాజీ గణేశన్ జెమినీ గణేశన్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించారు,

మరింత సమాచారం తెలుసుకోండి: