జులై 8 వ తేదీన  ఒక సారి చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎన్నో  ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి . మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి  వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు  సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 


 కుమారస్వామి రాజా జననం  : ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒడిశా గవర్నర్గా పనిచేసిన కుమారస్వామి రాజా 1898 జూలై 8 వ తేదీన జన్మించారు. సత్య గ్రహానికి జాగృతం చేసేందుకు వచ్చిన మహాత్మా గాంధీని దర్శించి... ఆయన ఆకర్షణ శక్తి మంత్రముగ్ధులయ్యారు  కుమారస్వామి రాజా. ఇక ఆ తర్వాత హోంరూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను లక్ష్యాలను పటిష్టం చేసేందుకు ఎంతగానో కృషి చేశారు. 1959లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 


 ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ జననం  :  సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త దార్శనికుడు గొప్ప దాత ఆయన ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ 1921 జూలై 8 వ తేదీన జన్మించారు. జమీందారీ వంశంలో జన్మించిన ఈయన గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన మహోన్నత మనిషి, తణుకులో ఆంధ్ర షూగర్స్ అనే కంపెనీని స్థాపించి ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు. ఒక గొప్ప పారిశ్రామిక వేత్తగా ఆయన ప్రస్థానం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 

 

 వైయస్ రాజశేఖర్రెడ్డి జననం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖరరెడ్డి 1949 జూలై 8 వ తేదీన జన్మించారు, 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎన్నికయ్యారు. తర్వాత 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఓటమి లేని నేత గా పోటీ చేసిన ప్రతి చోట కూడా విజయం సాధించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి ఆంధ్ర  రాజకీయాలను శాసించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రమాదవశాత్తు కన్నుమూశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 

 

 సౌరబ్  గంగూలీ  జననం  :  భారత దేశానికి చెందిన దిగ్గజ క్రికెట్ క్రీడాకారులు లో ఒకరు.. భారత జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు సారథ్యం వహించి ఎన్నో విజయాలను అందించిన వ్యక్తి సౌరవ్ గంగూలి. 1972 జూలై 8 వ తేదీన జన్మించారు. బెంగాల్ టైగర్ కోల్కత్తా యువరాజు దాదా అనే ముద్దుపేర్లు  గంగూలి కి  ఉన్నాయి. గంగూలి  ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయం అని చెప్పాలి. ప్రస్తుతం సౌరవ్ గంగూలి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గంగూలీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఎంతగానో రాటుదేలింది  చెప్పవచ్చు. 

 

 నాయని సుబ్బారావు మరణం : తొలితరం తెలుగు భావకవి స్వాతంత్ర సమరయోధుడు అయినా నాయని సుబ్బారావు 1978 జూలై 8 వ తేదీన పరమపదించారు. ఎన్నో అద్భుతమైన రచనలు రచించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. స్వతంత్ర పోరాటంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు. 

 

 రాజారావు మరణం : ఇంగ్లీష్ లో నవలలు కథలు రాసిన భారతీయ రచయిత రాజారావు జూలై 2006 జులై 6వ తేదీన పరమపదించారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయన ఇంగ్లీష్ లో నవలలు  కథలు రాయడంలో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: