జూలై 12 వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి  మరొక్కసారి చరిత్ర పుటల్లోకి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 


 పూణే వరదలు  : ఖడక్వస్లా  ఫాన్సెట్  ఆనకట్టల కారణంగా సగం పూణే  నగరం మొత్తం మునిగిపోయింది. దీంతో ఒక్కసారిగా లక్ష కుటుంబాలు మొత్తం నిరాశ్రయులు అయ్యారు. ఇక ఈ దుర్ఘటనలో ఏకంగా రెండు వేల మందికి పైగా మరణించారు. 


 పువ్వాడ శేషగిరి రావు జననం :: ప్రముఖ తెలుగు కవి పండితులు అయిన పువ్వాడ శేషగిరిరావు 1906 జులై 12వ తేదీన జన్మించారు, ఈయన రచించిన కవితలతో షాదుషా  అనే బిరుదును కూడా పొందాడు. ఈయన  రాసిన రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి.  బుర్రకథ రచయితగా నాటక రచయితగా ఎన్నో రచనలు అందించడంతో పాటు ఎన్నో పద్యకావ్యాలను కూడా రాశారు పువ్వాడ శేషగిరిరావు. 

 

 ఇరివెంటి కృష్ణమూర్తి జననం : తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి తరం కథకులలో ఒకరు అయినా ఇరివెంటి కృష్ణమూర్తి 1930జూలై 12 వ తేదీన జన్మించారు. ' ఈయన యువభారతి సాహిత్య సంస్థలు తీర్చిదిద్ది 20 ఏళ్లపాటు నిర్వహించారు. అంతేకాకుండా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఏకంగా జైలు శిక్ష కూడా అనుభవించారు కృష్ణమూర్తి, యువభారతి సంస్థ అధ్యక్షుడిగా ఉన్న ఇరివెంటి కృష్ణమూర్తి తెలంగాణలో సాహిత్య వికాసానికి ఎంతగానో కృషి చేశారు. 1989 ఏప్రిల్ 26వ తేదీన పరమపదించారు ఇరివెంటి కృష్ణమూర్తి

 

 గడ్డం గంగారెడ్డి జననం :  తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు లోక్సభ సభ్యుడు అయిన గడ్డం గంగారెడ్డి 1933 జూలై 12 వ తేదీన జన్మించారు. 1957లో నిజాంబాద్ జిల్లాలో ఓ  గ్రామ సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు గడ్డం గంగారెడ్డి, ఇక ఆ తర్వాత మూడు సార్లు లోక్సభకు ఎన్నికైయ్యారు.  1991లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిజాంబాద్ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 12 13వ లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో  వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు గడ్డం గంగారెడ్డి. 2004 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి  ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు, 2012లో గడ్డం గంగారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

 ఆచంట శరత్ కమల్ జననం : ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడైన ఆచంట శరత్  కమల్  1982 జూలై 12 వ తేదీన జన్మించారు. ఈయన భారత్ తరఫున టేబుల్ టెన్నిస్ లో ఎన్నో పథకాలను సాధించారు.ఇక  టేబుల్ టెన్నిస్ లో ఈ  ఆటగాడు సాధించిన విజయాలకు గాను భారత ప్రభుత్వం అర్జున పురస్కారం తో సన్మానించింది. 


 కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరణం : తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం నిర్మాత విజ్ఞాన చంద్రికా మండలి వ్యవస్థాపకుడు అయిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 1923 జూలై 12 వ తేదీన మరణించారు. తెలుగు వారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసింది ఈయనే. ఉన్నత ప్రమాణాలతో కూడిన చరిత్ర విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టినది  కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఆయన ఎందరో సాహితీ మూర్తులకు సహచరుడిగా కూడా పనిచేశారు. అంతేకాదు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా కూడా ఉంటారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. నిద్రాణమైన  తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు అని చెప్పవచ్చు. 

 

 దారా సింగ్ మరణం : భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్  నటుడు రాజకీయ వేత్త అయిన దారాసింగ్  2012 జూలై 12 వ తేదీన పరమపదించారు. మొదట ప్రొఫెషనల్ రెజ్లర్ అయిన  1952లో నట జీవితాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా ఆ తర్వాత కాలంలో రాజ్యసభ కూడా ఎన్నికయ్యారు. రాజ్యసభకు ఎన్నికైన క్రీడాకారులలో మొదటి వ్యక్తి దారాసింగ్ అనే చెప్పాలి. ఈయన  సినిమాలో నటించడంతో పాటు పలు సినిమాలకు దర్శకుడిగా నిర్మాతగా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: